Pub Minor Rape Case: వణికిస్తోన్న హైదరాబాద్‌ పబ్‌లు - సంపన్నుల పిల్లల అరాచకాలు..!!

Pub Minor Rape Case: హైదరాబాద్‌లో పబ్‌లు భయపెడుతున్నాయి. అరాచకాలకు ఉసిగొల్పే అడ్డాలవుతున్నాయి. తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నాయి. పబ్‌లలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న తీరు యువతకు శాపంగా మారుతోంది. తరచూ పబ్‌లపై దాడులు జరుగుతున్నా, కేసులు పెడుతున్నా, అరెస్టులు చేస్తున్నా తీరు మారడం లేదు. మైనర్లకు ఎంట్రీ కల్పిస్తూ అఘాయిత్యాలకు ఉసిగొల్పుతున్న వ్యవహారంపై విపక్షాలు కన్నెర్ర జేస్తున్నాయి.

Written by - Saptagiri | Last Updated : Jun 4, 2022, 04:50 PM IST
  • వణికిస్తోన్న హైదరాబాద్‌ పబ్‌లు
  • సంపన్నుల పిల్లల అరాచకాలు
  • అరాచకాలకు ఉసిగొల్పే అడ్డాలవుతున్నాయి
Pub Minor Rape Case: వణికిస్తోన్న హైదరాబాద్‌ పబ్‌లు - సంపన్నుల పిల్లల అరాచకాలు..!!

Pub Minor Rape Case: మొన్న టకీలా పబ్‌లో అశ్లీల నృత్యాలు.. నిన్న అమ్నేషియా పబ్‌ నుంచి బాలికను తీసుకెళ్లి అరాచకం. ఇవాళ మస్తీపబ్‌లోనూ అమ్మాయిలతో అభ్యంతరకరంగా డ్యాన్సులు. హైదరాబాద్‌లోని పబ్బుల్లో నిబంధనలు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తెల్లవార్లూ డీజే మోతలు, అశ్లీల నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. అమాయకులైన యువకులను ఆకర్షిస్తున్నారు. సంపన్నుల పిల్లలకు ఎర వేస్తున్నారు. చదువుకునే వయసులోనే, మైనారిటీ తీరకముందే అనైతిక చర్యలకు ఉసిగొల్పుతున్నారు. ఎంజాయ్‌ పేరిట ఘోరాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా అమ్మాయిలపై అరాచకాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. వారం రోజులుగా జరిగిన ఘోరాలు, పబ్‌లపై పోలీసుల దాడులు, కేసుల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు భయకంపితులవుతున్నారు. మరి.. అసలు పబ్బుల నిబంధనలేంటి? అవి అమలవుతున్నాయా? పోలీసులు పర్యవేక్షిస్తున్నారా? అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇక, అమ్నేషియా పబ్‌కు వచ్చిన అమ్మాయిని వెంట తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. పబ్‌నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయటకు తీసుకెళ్లిన కొందరు యువకులు.. కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు వెల్లడించింది. బెంజ్‌కారులో అరాచకానికి పాల్పడగా.. ఇన్నోవా కారులో తిరిగి పబ్‌ దగ్గర వదిలేశారని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తనపై అనైతికంగా ప్రవర్తించిన వారిలో ప్రజా ప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు కూడా బాలిక పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

పోలీసులు మాత్రం ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. వారిలో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారని తెలిపారు. బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌, సీసీ ఫుటేజీ ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ జోయల్‌ డేవిస్‌. అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్లను కూడా చేర్చామన్నారు.

అయితే, ఈ ఘటనలో హోంమంత్రి మనవడు, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ కుమారుడితో పాటు.. ప్రముఖుల కొడుకులు నిందితులని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వరుస నిరసనలు చేపడుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వాళ్ల ఒత్తిళ్లతో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణ తీరుపై సందేహాలు లేవనెత్తుతున్నారు. అంతేకాదు.. ఇవాళ  ప్రెస్‌మీట్‌ పెట్టిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓ ఎమ్మెల్యే కుమారుడు ఈ కేసులో నిందితుడంటూ ఫోటోలు విడుదల చేశారు. వీడియో ఫుటేజీ కూడా చూపించారు. ఈ ఆధారాలు దొరికిన తర్వాత కూడా పోలీసులు నిజమైన నిందితులను వదిలేస్తున్నారని ఆరోపించారు.

పోలీసుల ప్రకటనలు, విపక్షాల వాదనల నేపథ్యంలో ఈ దురాగతంపై దర్యాప్తు జరుగుతున్న తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజీ తొలగించే ప్రయత్నం జరుగుతోందని, కొందరిని కాపాడేందుకు ఆధారాలు మార్చే యత్నాలు సాగిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోతే, సీబీఐని ఆశ్రయిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. పక్షపాతం లేకుండా నిందితులను అందరినీ గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...

Also Read: Bitter Gourd Benefits: కాకరకాయను వీరు అస్సలు తినకూడదు..తింటే దుష్ప్రభావాలు తప్పవు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News