Rahul Gandhi Visit Chanchalguda: చంచల్ గూడ జైల్లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులతో ములాఖత్ కు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ తో పాటు మరో ఇద్దరికి ములాఖత్ కు అనుమతిస్తూ జైళ్ల శాఖ డీజీ నిర్ణయం తీసుకున్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించడంతో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారిని అరెస్ట్ చేశారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా వారితో ములాఖత్ ఏర్పాటుచేయాలని టీకాంగ్రెస్ భావించింది. దీనికోసం గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు జైళ్ల శాఖ అధికారులను కలిసి ములాఖత్ కోసం అభ్యర్థిస్తున్నారు. అయితే వారి రిక్వెస్ట్‌పై అధికారులు ఇన్నాళ్లూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతూ వచ్చారు. చివరకు రాహుల్‌గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కకు మాత్రం ములాఖత్ కు అనుమతిచ్చారు.
జైళ్ల శాఖ డీజీ అనుమతించిన నేపథ్యంలో కాసేపట్లోనే రాహుల్ గాంధీతో పాటు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పరామర్శించనున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 17 మంది చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారితో రాహుల్‌గాందీ మాట్లాడనున్నారు. రాహుల్‌గాంధీ రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు వెళ్తున్న సందర్భంగా ఆ పరిసరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
also read: Rahul Gandhi:కేసీఆర్ తో టచ్ లో ఉంటే సస్పెండ్.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్
also read: KTR Counter to Rahul: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. కానీ కేసీఆర్ లోకల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.