Rain Alert In Telangana: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షసూచనలను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రోజును వచ్చే 10వ తేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా ప్రకటించింది. ఈ అంశంపై నిన్న రాత్రి వాతావరణ కేంద్రం వెదర్ బులిటెన్ కూడా విడుదల చేసింది.
నేడు జోగులాంబ గద్వాల్ నుంచి మొదలుకొని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మరి కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఈ క్రమంలో ప్రజలు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో అధికారు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించింది.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా 10వ తేదీన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన మోచా తుఫాన్ కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో రానున్న 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక 11వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తగా పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
రాబోయే 11వ తేది నుంచి రాష్ట్రంలో పలు ప్రదేశాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపంది. ఇప్పటికే అదివారం పలు చోట్ల వర్షాలు పడ్డాయి. జిల్లాల వారీగా వర్షపాతం ఇలా నమోదైంది..హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 34.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 0.4 మి.మీ దుండిగల్, 41.8 మి.మీ మహబూబ్‌నగర్ నమోదు కాగా.. మరి కొన్ని ప్రాంత్రాల్లో ఎండ ప్రభావం పెరిగింది.
Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook