రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు

Updated: Apr 19, 2019, 03:11 PM IST
రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు
File pic

హైదరాబాద్‌ : తెలంగాణలో అక్కడక్కడా కురుస్తున్న అకాల వర్షాలు ఇప్పటికే అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా రానున్న మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తప్పేలా లేవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మూడు రోజులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు. 

వాతావరణ శాఖ చేసిన ఈ హెచ్చరికలతో రైతన్నలు తమ పంటలను కాపాడుకునేందుకు అప్రమత్తం అవుతున్నారు.