Marriage: 'మేం తెలంగాణోళ్లం.. బువ్వ తక్కువ పెడితే అరాచకమే'.. పెళ్లిలో కొట్టుకున్న బంధువులు

Food Shortage Fight In Marriage: తెలంగాణ పెళ్లిళ్లపై సోషల్‌ మీడియాలో మస్త్‌ ట్రెండింగ్‌ వీడియోలు వస్తున్నాయి. 'మేం తెలంగాణోళ్లం మర్యాద ఒక్కటే కాదు ముక్క గూడ కావాలి' వంటి రీల్స్‌ వైరలవుతున్నాయి. తాజాగా పెళ్లి విషయంలోనే వైరలయ్యే సంఘటన చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 20, 2024, 10:21 PM IST
Marriage: 'మేం తెలంగాణోళ్లం.. బువ్వ తక్కువ పెడితే అరాచకమే'.. పెళ్లిలో కొట్టుకున్న బంధువులు

Marriage Fight: వివాహాల్లో తెలంగాణ సంస్కృతి భిన్నం. తెలంగాణ ప్రాంత పెళ్లిళ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా మందు, విందు, చిందు లేనిది పెళ్లి వేడుక పూర్తి కాలేదు. వీటి వద్ద ఏదైనా తేడా వస్తే మామూలుగా ఉండదు. అతి ముఖ్యంగా భోజనాల వద్ద పిసినారితనం ప్రదర్శిస్తే మాత్రం గొడవలే. చివరి మనిషి వరకు భోజనాలు దొరకపోతే ఫంక్షన్‌ హాల్‌ కాస్త రణరంగంగా మారుతుంది. అలాంటి సంఘటనే తాజాగా చోటుచేసుకుంది. భోజనాలు తక్కువపడ్డాయని బంధువులు పొట్టుపొట్టు కొట్టుకున్న సంఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..

Also Read: Karthika Deepam: సినిమా రేంజ్‌లో కార్తీక దీపం.. చరిత్రలోనే తొలిసారి సీరియల్‌కు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

 

మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో బుధవారం ఓ వివాహం జరిగింది. ఈ గ్రామానికి చెందిన వధువును వేములవాడకు చెందిన వధువుతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఇక భోజనాల కోసం బంధువులంతా కదిలారు. అయితే పెద్ద మొత్తంలో బంధువులు తరలిరావడంతో భోజనాలు సరిపోలేదు. వచ్చిన బంధువులకు తక్కువ తక్కువ భోజనాలు పెట్టి సరిపెట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికప్పుడు వండేందుకు ప్రయత్నించగా తీవ్ర ఆకలి మీద ఉన్న బంధువుల ఓపిక నశించింది. దూరం నుంచి పెళ్లికి వస్తే భోజనాలు పెట్టరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

 

ఈ క్రమంలో భోజనం విషయమై బంధువుల మధ్య వాగ్వాదం మొదలైంది. పెద్ద మనుషులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా చినికి చినికి గాలివానగా మారి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తలలు పగులగొట్టుకునే స్థాయికి గొడవ జరిగింది. వధువు కుటుంబసభ్యులకు మద్దతుగా గ్రామస్తులు తరలివచ్చారు. దీంతో గొడవ మరింత పెద్దగా అయ్యింది. తమపై దాడి చేసిన వరుడి బంధువులను గ్రామం దాటి వెళ్లనియ్యమని బస్సులను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసి బంధువుల పెళ్లి బస్సులను పంపించారు. 

గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. అయితే ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా వరుడు తరఫున బంధువులు భోజనం చేయకుండానే ఉపవాసంతో తిరుగుముఖం పట్టడం విశేషం. వీరి పెళ్లి మా చావుకు వచ్చిందని గ్రామస్తులు తిట్టి పోశారు. వధువు తరఫున వారు భోజనాలు సరిపడా వండించకపోవడంతోనే ఈ గొడవకు దారి తీసిందని తెలిసింది. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ముక్కలు తక్కవయ్యాయని గొడవలు జరిగాయి. ఇప్పుడు భోజనాలు లేవని గొడవ జరగడం విశేషం. అందుకే అంటారు తెలంగాణ పెళ్లి అంటే మందు, విందు, చిందు మూడు తప్పనిసరిగా ఉండాలి అని.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News