Revanth Reddy: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వరుసగా మూడవరోజు విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. విద్యార్థుల నిరసనతో పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించారు. ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. క్యాంపస్ కు చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్యాంపస్ లోపల ఆందోళన చేస్తున్న విద్యార్థులు మీడియాకు కనిపించకుండా ఎత్తున బారీకేడ్లు పెట్టారు. బాసరకు వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసే అనుమతి ఇచ్చారు. రాజకీయ నాయకులెవరు బాసరలోకి ఎంట్రీ ఇవ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు. పోలీసుల కళ్లుగప్పి బాసర ట్రిపుల్ ఐటీకి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాలి నడకన వచ్చి గోడ దూకి క్యాంపస్‌లోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి. అక్కడే ఉన్న పోలీసులు రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి మరో వాహనంతో రేవంత్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. వందలాది మంది పోలీసుల పహారా ఉన్న రేవంత్ రెడ్డి బాసర క్యాంపస్ వరకు ఎలా వచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో క్యాంపస్ పరిసరాల్లో భద్రత మరిం పెంచారు పోలీసులు.
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్ కూడా పోలీసులను చేధించుకుని ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించారు. పొలాల వెంట ఉన్న క్యాంపల్ గోడ దూకి శంకర్ లోపలికి వెళ్లగా .. గమనించిన పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. బాసర విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు కామారెడ్డి జిల్లాలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బండి సంజయ్. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసినా.. సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Read also: Agnipath Bharat Bandh: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా.. రేపు భారత్ బంద్!
Read also: Agnipath Protest: ఆర్మీలో చేరాలని కలలు కన్న రైతు బిడ్డ.. పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook