రవిప్రకాశ్‌ని కలిసిన అనంతరం కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

రవిప్రకాశ్‌ని కలిసిన అనంతరం కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

Updated: Oct 8, 2019, 06:15 PM IST
రవిప్రకాశ్‌ని కలిసిన అనంతరం కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుటుంబం ఓ దండుపాళ్యం ముఠాలా తయారైందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ నుంచి బయటకొస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నను కొట్టిపారేసిన రేవంత్.. వాళ్లంతా ఒకటేనని చెబుతూ అదో దండుపాళ్యం ముఠా అని విమర్శించారు. అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే.. అధికారం కోల్పోయాక దాని పర్యవసానం అనుభవించక తప్పదని కేసీఆర్‌కు హితవు పలికారు. 

సోమవారం చంచల్‌గూడ జైల్లో టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌తో ములాఖత్ అయిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.