తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ( YS Jagan ) కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు పట్టిన చీడ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ నైజం ఏంటనేది క్రమక్రమంగా తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు.
Jagga Reddy vs Minister Harish Rao: హైదరాబాద్: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మంత్రి హరీశ్ రావుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సింగూరు, మంజీరా డ్యామ్లు నింపే వరకు నీళ్ల కోసం నా పోరాటం ఆగదని స్పష్టంచేసిన ఆయన.. అవసరమైతే ఈ విషయంలో మంత్రి హరీష్ రావును నిలదీయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు.
Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.