Kama Reddy Accident: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గేట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ..వాహనాన్ని ఢీకొట్టింది. స్పాట్‌లో ముగ్గురు చనిపోగా..మార్గ మధ్యలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మృతులు పిట్లం మండలం చిల్లర్గికి చెందిన వారిగా గుర్తించారు. ఎల్లారెడ్డిలో బంధువుల దశ దిన కర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 22 మంది ఉన్నారు.
Also read:Sabja Seeds Rose Milk: వేసవిలో చల్లదనంతో పాటు..బరువు తగ్గేందుకు అద్భుత డ్రింక్
Also read:Asani Cyclone: అసనీ తుపాను పేరు ఎవరు ఎలా పెట్టారు, అసనీ అంటే అర్ధమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Kama Reddy Accident: కామారెడ్డి జిల్లాలో రోడ్ టెర్రర్..ఐదుగురు మృతి..!
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
లారీ- టాటాఏస్ వాహనం ఢీ
మృతుల సంఖ్య పెరిగే అవకాశం