Sankranthi Effect: నిత్యం పరుగులపెడుతూ కన్పించే జంటనగరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఉరుకులు, పరుగులతో రాత్రనక పగలనక శ్రమించే నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది. ఆ జంటనగరం ఇప్పుడు పల్లెకు పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నగరం, హైటెక్ సిటీ , భాగ్యనగరం, జంట నగరాలు ఇలా చాలా ప్రత్యేకతల్ని కలిగిన నగరం హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిన కీలక నగరంగా ఉన్న హైదరాబాద్ (Hyderabad)ఎప్పుడూ బిజీగా ఉంటుంది. పరుగులు తీసే ప్రజలు, వేగంగా దూసుకుపోయే వాహనాలు, ఉరుకులు, పరుగులే జీవితంగా రోడ్లపై నిత్యం కన్పించే ప్రజానీకమే ఆ నగరానికి ఊపిరి. అంతటి రద్దీ నగరం..ఎప్పుడూ శ్రమించడమే తప్ప విశ్రమం ఎరుగని ఆ నగరం ఇప్పుడు విశ్రమిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అంతటి మహానగరం ఇప్పుడు పల్లెకు పోయింది.
సంక్రాంతి (Sankranthi Effect) పండుగప్పుడే ఈ దృశ్యం కన్పిస్తుంది హైదరాబాద్‌లో. ప్రతియేటా ఇదే పరిస్థితి. తెలుగువారి పెద్దపండుగకు మెజార్జీ పౌరులు సొంతూర్లుకు, పల్లెలకు తరలివెళ్లారు. విద్యాలయాలు, కళాశాలలు తలుపులు వేసుకున్నాయి. ఆఫీసులు బంద్ అయ్యాయి. నిత్యం తీరిక లేకుండా గడిపే ప్రజానీకం బంధుమిత్రులతో గడిపేందుకు పయనమయ్యారు. నగర రహదారులు బోసిపోయాయి. వెలవెలబోతూ..నిర్మాణుష్యంగా కన్పిస్తున్నాయి. ఏపీకు చెందినవారు ఏపీ, తెలంగాణలోని సొంతూర్లకు పయనమై..పండుగ జరుపుకుంటుంటే..ఇక్కడ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా సేద తీరుతూ..తిరిగి ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తోంది.
Also read: Telangana : ఇకపై పదవ తరగతి పరీక్షలు 12 ఏళ్లకే రాయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook