ఆ దుస్థితి మనకొద్దు: Minister Harish Rao

మొక్క‌ల‌ను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకుని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకుందామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao) అన్నారు. ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే రూ. 5 కోట్లు ఖ‌ర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

Updated: Aug 1, 2020, 11:55 PM IST
ఆ దుస్థితి మనకొద్దు: Minister Harish Rao
మంత్రి హరీష్ రావు ఫైల్ ఫోటో

సిద్దిపేట: మొక్క‌ల‌ను పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకుని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకుందామని మంత్రి హరీష్ రావు ( Minister Harish Rao) అన్నారు. చెట్లు లేకపోవడంతో పర్యావరణం దెబ్బతింటోందని.. గాల్లో ఆక్సీజన్ శాతం తగ్గి జనం ఆక్సిజన్ సిలిండర్లు ( Oxygen cylinders ) కొనుక్కునే దుస్థితి దాపురిస్తోందని మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్ప‌టికే ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఆక్సిజ‌న్‌ కరువై ఆక్సిజెన్ సిలిండర్లు కొనే దుస్థితి వ‌చ్చిందని అన్నారు. సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచే ప్రయత్నంలో భాగంగా అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు ( Seed balls ) చల్లే కార్యక్రమన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Janasena: జనసేన పనికిమాలిన సేన.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఆక్సిజన్ కురువైన ప్రాంతాల్లో ఒక్కో మ‌నిషి సగటున 3 ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను కొంటున్నాడు. ఒక్కో సిలిండ‌ర్ కోసం ఖ‌ర్చు రూ. 700 చొప్పున మూడు సిలిండ‌ర్ల‌కు కలిపి రూ. 2,100 ఖ‌ర్చు చేయాల్సి వస్తోంది. అలా ఒక మనిషి జీవిత కాలంలో పీల్చే ఆక్సిజన్ కొనుగోలు చేయాలంటే రూ. 5 కోట్లు ఖ‌ర్చు అవుతుందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఇకనైనా మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోకపోతే.. మ‌న‌ం కూడా ఆక్సిజ‌న్‌ను కొనే దుస్థితి వస్తుందని.. అలాంటి దుస్థితి మ‌న‌కు రావొద్దని కోరుకుందామని మంత్రి హ‌రీష్‌ రావు పిలుపునిచ్చారు. అనంతరం Drones ద్వారా సీడ్ బాల్స్ చల్లారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య‌ ( Padmasri Vanajeevi Ramaiah), ఆయ‌న స‌తీమ‌ణి పాల్గొన్నారు. Also read: COVID-19: కరోనాతో బీజేపి నేత, ఏపీ మాజీ మంత్రి మృతి