Janasena: జనసేన పనికిమాలిన సేన.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

జనసేన పార్టీపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ( AP minister Shankar Narayana) పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena party) జనం కోసం చేసింది ఏమీ లేదని... అది ఒక పనికిమాలిన సేన అని మండిపడ్డారు.

Last Updated : Aug 1, 2020, 06:20 PM IST
Janasena: జనసేన పనికిమాలిన సేన.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

అనంతపురం: జనసేన పార్టీపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ( AP minister Shankar Narayana) పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ( Janasena party) జనం కోసం చేసింది ఏమీ లేదని... అది ఒక పనికిమాలిన సేన అని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ప్యాకేజిల కోసం పనిచేయడం తప్ప ప్రజల కోసం చేసింది శూన్యమని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఇది సరైన సమయం కాదు అంటున్న పవన్ కళ్యాణ్‌కు... మరి షూటింగ్‌లకు కూడా ఇది సరైన సమయం కాదని తెలియదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి శంకర్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. Also read: Manikyala Rao: కరోనాతో ఏపీ మాజీ మంత్రి మాణిక్యాల రావు మృతి

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డిఏ రద్దు బిల్లులను Chandrababu Naidu వ్యతిరేకించడంపై మంత్రి శంకర్ నారాయణ స్పందిస్తూ.. శ్రీకృష్ణ కమిటీ, జీఎన్‌రావు కమిటీ రాజధానిగా అమరావతి అనుకూలం కాదని నివేదిక ఇచ్చినప్పటికీ చంద్రబాబు కేవలం తన స్వార్థం కోసమే అప్పట్లో అమరావతిని రాజధానిగా చేశారని ఆరోపించారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణ కోసం సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు నిర్మించాలని నిర్ణయించడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం అమరావతిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు రైతులను తప్పుదోవ పట్టించారని మంత్రి వ్యాఖ్యానించారు. Also read: Vizag crane tragedy: సీఎం జగన్ స్పందన

Trending News