రాహుల్ తో ఉత్తమ్ భేటీ ; సీట్ల పంచాయితీ ఇకనైనా తేలేనా ?

                         

Last Updated : Nov 12, 2018, 01:28 PM IST
రాహుల్ తో ఉత్తమ్ భేటీ ; సీట్ల పంచాయితీ ఇకనైనా తేలేనా ?

మహాకూటమి సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరుకుంది. సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించేందుకు రాహుల్ గాంధీతో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా  కూటమి పార్టీలతో చర్చించిన విషయాలపై రాహుల్ గాంధీకి  ఉత్తమ్ వివరణ ఇచ్చారు. అలాగే అభ్యర్ధుల తుది జాబితాపై చర్చించినట్లు తెలిసింది. కాగా ఈ భేటీలో  తెలంగాణ ఎన్నికల స్ర్కీనింగ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

టి.కాంగ్రెస్ నేతలపై రాహుల్ గుస్సా ?

ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు సీట్ల పంచాయితీ తేలకపోవడంపై రాహుల్  అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్.. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించారు. అయితే ఈ రోజైనా ఈ సీట్ల పంచాయితీ తేలుతుందో లేదో చూడాల్సి ఉంది. 

దూకుడుగా వెళ్లున్న టీఆర్ఎస్ ..

టీఆర్ఎస్ తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రజా క్షేత్రంలో దూకుడుగా వెళ్లోంది. అయితే మహాకూటమి మాత్రం సీట్ల బేరాల దగ్గరే ఉంది. మహాకుటమిలోని  టీజేఎస్ 10,  సీపీఐ నాల్గు సీట్ల కంటే తగ్గే పరిస్థితి లేదని తేల్చి చెప్పాయి.  ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సీట్ల పంచాయితీ తేల్చాలని  ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల పంచాయితీ తేల్చేందుకు టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కమార్ రెడ్డి,  కుంతియా ఢిల్లీకి చేరుకొని పార్టీ అధ్యక్షుడిని కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది

Trending News