Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం, Telangana CM KCR దిగ్భ్రాంతి

Mahabubabad Road Accident: అతివేగం, నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలో అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Jan 29, 2021, 02:14 PM IST
  • మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
  • ఆటో, లారీ ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు
  • విషాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Mahabubabad: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం, Telangana CM KCR దిగ్భ్రాంతి

Mahabubabad Road Accident: మహబూబాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో, లారీ ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొన్ని రోజుల్లో ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పెళ్లింట విషాదం..
ఇటీవల వీరి కుమార్తె వివాహం కుదిరింది. పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి దుస్తులు కొనుగోలు చేసేందుకు వధువుతో పాటు వారి కుటుంబసభ్యులు ఆటోలో వరంగల్‌కు వెళ్తున్నారు. అంతలోనే వీరు ప్రయాణిస్తున్న ఆటోను మర్రిమిట్ట వద్ద లారీ ఢీకొనడం(Road Accident In Road Accident)తో పెళ్లింట పెను విషాదం చోటుచేసుకుంది.

Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి

ఢీకొన్న వెంటనే లారీ కిందకి ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతిచెందగా, ఇందులో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మహబూబాబాద్(Mahabubabad) పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొక్లెయినర్ సహాయంతో ఆటోను పక్కకు జరిపారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఎర్రకుంట తండా వాసులుగా భావిస్తున్నారు.

Also Read: International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగించిన DGCA

 

లారీ, ఆటో ఢీకొన్న విషాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు సత్వరమే వైద్య, ఇతరత్రా సేవలు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. లారీ అతివేగంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, రూ.4700 పతనమైన Silver Price

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News