TS Jobs Application Process: నేటి నుంచి 17,794 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ... అభ్యర్థులు ఇలా అప్లై చేసుకోవాలి..

TS Govt Jobs Applications: తెలంగాణలో కొలువుల జాతర నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. నేటి నుంచి గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 2, 2022, 11:56 AM IST
  • నేటి నుంచి గ్రూప్ 1, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
  • మొత్తం 17,794 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచే
  • అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
TS Jobs Application Process: నేటి నుంచి 17,794 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ... అభ్యర్థులు ఇలా అప్లై చేసుకోవాలి..

TS Govt Jobs Applications: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-1, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. గ్రూప్-1 కింద 503 పోస్టులు, పోలీస్ శాఖలో 17,291 పోస్టులకు ఆన్‌లైన్‌లో ఇవాళ్టి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు మే 2 నుంచి 30 వరకు, పోలీస్ ఉద్యోగాలకు మే 2 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆసక్తి, తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు చివరి తేదీ లోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటంది. పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.tslprb.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 1 ఉద్యోగాలకు అప్లై చేసేవారికి ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) తప్పనిసరి. పోలీస్ ఉద్యోగాలకు నేరుగా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు చివరి తేదీ దాకా వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చివరలో సర్వర్ డౌన్ వంటి సమస్యలు తలెత్తితే అభ్యర్థులు ఆందోళనకు గురవుతారని.. అలా కాకుండా ముందే దరఖాస్తు చేసుకుంటే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చునని చెబుతున్నారు.

గ్రూప్ 1 ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి : 

మొదట టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in ఓపెన్ చేయండి.
ఇదివరకు ఓటీఆర్ లేకపోతే... కొత్తగా ఓటీఆర్ నమోదు చేసుకోండి. ఇందుకోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి... మీ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ వివరాలను నమోదు చేయాలి. అనంతరం అక్కడ సూచించిన మేరకు వివరాలు పొందుపరచాలి.
ఒకవేళ గతంలో ఓటీఆర్ నమోదు చేసుకుని... ఇప్పుడు అందులో మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే ఓటీఆర్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి సవరణ చేయవచ్చు.
అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత దాన్ని ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

పోలీస్ ఉద్యోగాలకు ఇలా :

అభ్యర్థులు మొదట  https://www.tslprb.in/ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో 'అప్లై ఆన్‌లైన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీరు ఇదివరకే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ తర్వాత మీ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి.. అక్కడ సూచించిన మేరకు మీ వివరాలు పొందుపరచాలి.
చివరలో ఫీజు చెల్లించి.. వివరాలు సరిచూసుకుని సబ్మిట్ ఆప్షన్ నొక్కాలి. 

Also Read: Vishwak Sen Prank: నడిరోడ్డుపై విశ్వక్‌ సేన్‌ రచ్చ.. సినిమా ప్రొమోషన్ కోసం ఇంత అరాచకమా!

Also Read: Ruturaj Gaikwad Record: బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో సచిన్ రికార్డును సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News