Lockdown in telangana extended: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి లాక్డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ కొత్త టైమింగ్స్, సడలింపులు (Lockdown new timings) ఇలా ఉన్నాయి.
Telangana COVID-19 cases latest updates: హైదరాబాద్: తెలంగాణలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడచిన 24 గంటల్లో 63,120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,308 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,51,035 మందికి చేరుకుంది.
Telangana COVID-19 cases: హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,36,766 కి చేరింది. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Lockdown extended in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Congress MP Revanth Reddy | ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కావాలంటే ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అత్యవసర సరుకులు తీసుకుని వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు పట్టెడన్నం పెట్టాలని వెళ్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Cyberabad CP Sajjanar on Lockdown in Telangana: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం ఉదయం 10 నుండి లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉండనుండగా.. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వారు లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
Banks timings during lockdown in Telangana: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అటు బ్యాంకుల సిబ్బంది, ఇటు ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.
Don’t stop ambulances entering Telangana: TS High Court హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారనే అంశాన్ని తెలంగాణ హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపడం అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు... సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించింది.
How to apply for e-pass in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుండి పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచే ఈ లాక్డౌన్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటికి రావాలంటే ఏమేం కావాలి, ఎవరి నుంచి అనుమతులు తీసుకోవాలి అంటూ అనేక సందేహాలతో పౌరులు అయోమయానికి గురవుతున్నారు. వారి సందేహాలకు సమాధానం ఇస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్ : తెలంగాణలో గత 24 గంటల్లో 65,923 శాంపిళ్లను పరీక్షించగా వాటిలో కొత్తగా 4,826 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల వ్యవధిలో 7,754 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
Telangana lockdown updates: హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే తప్ప కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు సైతం ఈ అంశంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది.
Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ప్రభుత్వాలకు పన్ను, ఇతరత్రా రూపంలో వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం తీసుకుంటున్న చర్యలకు నిధుల విడుదల చేయాల్సి ఉండటంతో ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
కరోనావైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను నిర్దేశిత ఆస్పత్రులకు తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఫలితంగా వైరస్ వ్యాపించే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సర్కార్ ఓ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇకపై అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
తెలంగాణలో సోమవారం ఇద్దరు కరోనావైరస్ పాజిటివ్ రోగులు చనిపోగా కొత్తగా 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం గుర్తించిన కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి చేరింది.
తెలంగాణలో లాక్డౌన్ (Lockdown in Telangana) మే 7వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి సహకరించిన వాళ్లందరికీ తాను మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.
లాక్ డౌన్ కారణంగా విద్యార్థులకు సంబంధించి పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, వాయిదా పడిన ఆ పరీక్షల సంగతేంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండటంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.