తెలంగాణలో నేడు వీఆర్ఓ నియామక పరీక్ష

తెలంగాణలో నేడు వీఆర్ఓ నియామక పరీక్ష

Last Updated : Sep 16, 2018, 08:30 AM IST
తెలంగాణలో నేడు వీఆర్ఓ నియామక పరీక్ష

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు (16-09-2018) గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి ఉదయం 11 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు 10,58,387 మంది అభ్యర్థులు హాజకానున్నారు. ఈ పరీక్ష నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో 627 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేయగా, ఆయా కేంద్రాల్లో దాదాపు మూడులక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

వీఆర్ఓ  పరీక్ష నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. ఇన్విజిలేటర్లు సమర్ధవంతంగా పనిచేయాలని, అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పరీక్ష నిర్వహించాలని సూచించారు.

పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు నిబంధనలు విధించారు. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు హాల్‌టికెట్‌ను తీసుకెళ్లాలి. హాల్‌టికెట్ రాని అభ్యర్థులు ఫొటో గుర్తింపుకార్డుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తీసుకెళ్లి పరీక్ష కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్లను కలవాలి. ఇక పరీక్ష విషయానికి వస్తే.. ఓఎమ్మార్ ఆన్సర్ షీట్‌లో బబుల్ చేయడానికి బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను వాడాలని.. వైట్‌నర్, బ్లేడ్ వంటివి ఉపయోగించరాదని అధికారులు సూచించారు.

 

Trending News