Telangana Election 2023: కాంగ్రెసోళ్లు దళితుల గురించి ఆలోచన చేయలేదు: సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది, విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ బిజీ బిజీ గా మారుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. ఆ వివరాలు..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 08:01 PM IST
Telangana Election 2023: కాంగ్రెసోళ్లు దళితుల గురించి ఆలోచన చేయలేదు: సీఎం కేసీఆర్

Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల రణభేరి మొదలైంది, ఆయా పార్టీలు నాయకులతో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుడు, అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగాలతో అదరగొడుతున్నారు. చేసిన అభివృద్ధి, గత పాలకుల పాలనపై కామెంట్స్ చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నాడు. ఈ రోజు మిర్యాలగూడలో జరిగిన ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ గారు ప్రసంగించారు. 

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..  ఎమ్మెల్యే భాస్కర్ రావు ఏనాడూ వ్యక్తిగత పనుల గురించి అడగలేదు. మిర్యాలగూడ అభివృద్ధి పనుల గురించే ఎప్పుడూ అడుగుతాడు. స్వయంగా రైతు అయిన భాస్కర రావులో రైతుల సంక్షేమం పట్ల తపన ఉన్నది. కేసీఆర్ కళాభారతి చక్కగా కట్టారు. ఆ భవనమే భాస్కర రావు మైండ్ కు దర్పణం పడుతుంది. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఎన్నికల్లో వ్యక్తుల్నే కాదు ఏ పార్టీ నుంచి నిలబడ్డాడు..? ఆ పార్టీల చరిత్ర, వైఖరి, దృక్ఫథం, ప్రజల గురించి ఆ పార్టీ ఆలోచనా సరళి ఏంది? అంతిమంగా ఏం కోరుతున్నరనేది నిర్ణయించి ఓటెయ్యాలి. ఎన్నికల్లో వ్యక్తి గెలువడం కంటే ప్రజలు గెలువడం ముఖ్యం. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి వుంటే మిర్యాలగూడలో ఎందుకు నిరంతర ఉద్యమం జరిగింది..? ప్రతి పంటకూ, ప్రతి తడికీ టెయిల్ ఎండ్ సంఘాల ఉద్యమమే జరిగేది. ఉద్యమ సమయంలో నీళ్లు ఇవ్వనంటే నేను లక్షల మంది రైతులతో వస్తామని, నీళ్లు విడుస్తామంటే 24 గంటల్లోనే నీళ్లను విడిచారు. కృష్ణానదిలో ఈసారి నీళ్లు తక్కువగా వస్తే..శ్రీశైలంలో ఆపుకున్నరు. సాగర్ వరకు నీళ్లు చాలా తక్కువొచ్చినయ్.

నీళ్ల సమస్యకు శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది. గోదావరి జలాలను ఆసిఫ్ నగర్ కెనాల్ నుండి నల్లగొండ ఉదయ సముద్రానికి, అక్కడి నుంచి పెద్ద చెరువుకు నీళ్లను తీసుకొస్తే శాశ్వతంగా నీళ్ల సమస్య తీరుతుంది. కాంగ్రెసోళ్ల వైఖరి ఎలా ఉందంటే..రైతుబంధు డబ్బులు దుబారా అని కాంగ్రెస్ కు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటడు. పిసిసి అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతదంటడు. కర్ణాటకలో కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇస్తమని చెప్పి గెలిచినాక 5 గంటల కరెంట్ ఇస్తున్నరు. ఇదీ కాంగ్రెస్ వాళ్ల దృక్ఫథం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి 24 గంటల కరెంటు ఇచ్చే మన దగ్గరికి వచ్చి 5 గంటలు ఇస్తనని చెబుతడు. చెప్పడానికి సిగ్గు కూడా ఉండాలె అని చెప్పిన. తరతరాలుగా దళిత జాతి అణిచివేతకు గురవుతావున్నది. వాళ్లు మన సాటి మనుషులు కాదా..? ఇంకెన్నాళ్లు దళితులు అలాగే ఉండాలి..? దళితులకు ఎమోషన్స్ లేవా..? గౌరవం లేదా.. ? వాళ్లకు ప్రేమలు లేవా? ఎందుకింత అత్యాచారం, అన్యాయం జరగాలె.. ? స్వతంత్రం వచ్చిననాడే కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన జాతులు, నిమ్న కులాలను గుర్తించి వాళ్ల కోసం గ్రోత్ ఇంజన్ పెట్టుంటే 70 ఏండ్ల కాలంలో దళితులు దరిద్రం తీరకపోవునా.. ? 

కాంగ్రెసోళ్లు దళితుల గురించి ఆలోచన చేయలే. ఏ ప్రభుత్వమూ చేయలేదు. దళితుల కోసం ‘దళిత బంధు’ అనే పథకాన్ని సృష్టించిందే కేసీఆర్. ఇంటికి పది లక్షల రూపాయలు ఇస్తున్నాం. బడ్జెట్ ఒకేసారి ఇచ్చేందుకు అనుకూలంగా లేకపోవచ్చు. దశలవారీగా అయినా పూర్తి చేస్తాం. దళితుల కోసం ఇలాంటి నినాదమైనా వస్తే..వారిలో ఆత్మవిశ్వాసం వస్తుంది. దేశవ్యాప్తంగా బాగుపడే0దుకు ఆస్కారం ఉంటది. ఒక ఒరవడిలో పడి కొట్టుకపోకుండా మంచి పథకాలు, సంస్కరణలు చేసేవారిని ప్రోత్సహించాలి. గెలిపించాలి. అలాంటప్పుడే చేసేవాళ్లకు ఇంకా చేయాలనిపిస్తుంది. నాడు రైతులకు బకాయీలుంటే ఇండ్ల తలుపులు దర్వాజాలు ఎత్తుకపోయేటోళ్లు. వారికి సాయం చేయాలని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడూ ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చాక ఆడబిడ్డల గోస తీరాలని మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం.

కరెంట్ బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. దామెరచర్లలో 30 వేల కోట్ల రూపాయలతో ఆల్ట్రా మెగా పపవర్ ప్రాజెక్ట్ ను చేపట్టాం. భాస్కర్ రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి..ఉద్యోగాలు రాని కొంతమంది యువతీయువకులకు తప్పకుండా చేయిస్తాం. ఒక దేశం, రాష్ట్రం బాగుపడ్డదా లేదా అని చూడాలంటే వాటి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాలను చూస్తారు. రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణ స్థానం తలసరి ఆదాయంలో ఎక్కడో ఉండేది. నేడు అగ్రస్థానంలో ఉన్నాం. సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ 70 ఏండ్ల నుంచి ఉన్న పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లను తలదన్ని కేవలం పదేండ్లున్న తెలంగాణ తలసరి ఆదాయంలో నేడు నంబర్ వన్. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. త్వరలోనే సాగునీళ్ల బాధ కూడా పూర్తిగా తీరిపోతుంది. రైతాంగాన్ని మొత్తం అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రయాణం ఇదేవిధంగా ముందుకు పోతే మంచిది. వేరేవాళ్లు వస్తే అనవసరమైన ఇబ్బందులు వస్తయ్. పదేండ్ల నుంచి ఒక కర్ఫ్యూ లేదు.. ఒక మత కల్లోలం లేదు. శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తా ఉన్నది.

Also Read: 6 Kg Semi Automatic Washing Machine: ఫ్లిఫ్‌కార్ట్‌లో 6 కేజీ MarQ by Flipkart వాషింగ్‌ మెషిన్‌ను రూ.990కే పొందండి..

కాంగ్రెస్ దుర్మార్గులు మా బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేశారు. అతని ప్రాణాలు కాపాడగలిగినం. మేం ఎన్నడూ అరాచకం, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కుట్రలు, పగలు పట్టలేదు.. చేయలేదు. భగతంతుని శక్తితోని ప్రజలకు మంచి చేసినం. భాస్కర్ రావు అన్ని ముఖ్యమైన సమావేశాల్లో నాతో ఉంటారు. ఎల్.హెచ్.పి.ఎస్. తో పోరాడినా గిరిజన సోధరులను ఎవరూ పట్టించుకోలేదు. మేం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశాం. గతంలో హైదరాబాద్ లో ప్రతి ఏడాది కత్తిపోట్లు, మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఉండేవి. కానీ గత పదేండ్లుగా చీమ చిటుక్కుమనట్లేదు. మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసింది. విధివంచితులు, వృద్ధలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులను ఆదుకోవడం ప్రభుత్వ సామాజిక బాధ్యత. 

పెన్షన్లను వెయ్యి రూపాయలతో ప్రారంభించాం. రెండు వేలు చేసుకున్నాం. ఎన్నికల తర్వాత తప్పకుండా ఐదు వేల వరకు పెంచుతాను. కళ్యాణ లక్ష్మి మొదటి యాభై వేలు పెట్టుకున్నాం. ఆ తర్వాత 75 వేలు, అనంతరం లక్షా పదహారు వేల రూపాయలు ఇస్తున్నాం. రైతుబంధును పన్నెండు వేల నుంచి పదహారు వేలకు దశలవారీగా పెంచి ఇస్తాం. తెలంగాణ నేడు మూడు కోట్ల ధాన్యం పండిస్తుంది. లిఫ్ట్ లన్నీ పూర్తయితే 4 కోట్ల టన్నులు పండించి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ అయితది మన తెలంగాణ.

93 లక్షల మంది రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం ఇస్తాం. కరెంటు కోతలు లేవు, మంచినీళ్ల బాధలు లేవు. పేదల సంక్షేమం, రైతుల సంక్షేమంలో వెనుకంజ వేయలేదు. భాస్కర రావు లాంటి ఉత్తమమైన వ్యక్తిని గెలిపించండి. కారు గుర్తుకు ఓటు వేసి బీఆరఎస్ ను గెలిపించండని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: iPhone Tapping: దేశంలో ఫోన్ ట్యాపింగ్ దుమారం, ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ అలర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

Trending News