BJP Leader Etela Rajender Comments In Gajwel: రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచి విజయ ఢంకా మోగిస్తుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గజ్వేల్ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు, అర్హులందరికీ దొరికేలా చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
Read More: WaterMelon: పుచ్చకాయలను ఎక్కువగా తింటున్నారా..?.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
దేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రజలు మోదీనే బలపరుస్తున్నారన్నారు. రైతు బంధు పేరుతో రైతులను ఆదుకున్న నాయకుడు మోదీ అని ఈటల కొనియాడారు. దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బతకాలంటే మోదీకే ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 370 ఆర్టికల్, 500 సంవత్సరాలకు పైబడి కొట్లాడిన అయోధ్య, త్రిపుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో కీలక నిర్ణయాలను బీజేపీ అమలు చేసిందన్నారు.
ప్రపంచ చిత్ర పటంలో ఎదుగుతున్న దేశంగా ఉన్న భారత దేశానికి నరేంద్ర మోదీ ఎంతో గుర్తింపు నిచ్చారని ఈటల రాజేందర్ అన్నారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు మందులు అందించిన ఘనత మోదీ నని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఈటల రాజేందర్ కాంగ్రెస్ పై సెటైర్ లు వేశారు.
Read More: Sreemukhi: ట్రెడిషనల్ దుస్తుల్లో కూడా శ్రీముఖి కిరాక్ ఫోజులు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
ఇదిలా ఉండగా.. దేశంలో బీజేపీ తనదైన మార్కుతో పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఈటల పేర్కొన్నారు. మరోవైపు..బీజేపీ, బీఆర్ఎస్ లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ కు పార్లమెంట్ సీట్లలో మెజారీటీ రాకుండా లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలలో మెజారీటీ సాధించే దిశగా అనేక పార్టీలు ఇప్పటికే ప్రచారంను తమదైన స్టైల్ లో కొనసాగిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebookదేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్నన ఈటల.. కాంగ్రెస్ ప్రభుత్వ మెరుగైన పాలన అందించాలి..