Kcr Rajbhavan: ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో గవర్నర్ తో కేసీఆర్ భేటీ.. విభేదాలు సమసిపోయినట్టేనా?

Kcr Rajbhavan:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు... అవును మీరు చదివింది నిజమే... దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్.. రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్.. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.

Written by - Srisailam | Last Updated : Jun 28, 2022, 10:50 AM IST
 Kcr Rajbhavan: ఎన్నాళ్లకెన్నాళ్లకు... రాజ్ భవన్ లో గవర్నర్ తో కేసీఆర్ భేటీ.. విభేదాలు సమసిపోయినట్టేనా?

Kcr Rajbhavan:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు... అవును మీరు చదివింది నిజమే... దాదాపు ఏడాది కాలంగా రాజ్ భవన్ ముఖమే చూడని గులాబీ బాస్.. రాజ్ భవన్ లో అడుగు పెట్టారు. ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్.. మీడియాకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు. ఏడాది తరువాత రాజ్ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసిఆర్.. నేరుగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను కలిశారు. కొంత కాలంగా గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి. గవర్నర్ తో కలిసి వేదిక పంచుకోలేదు కేసీఆర్. రాజ్ భవన్ లో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఆయన  ప్రమాణస్వీకారం రాజ్ భవన్ లో జరిగింది. గవర్నర్ తమిళి సై ఆయన చేత ప్రమాణం చేయించారు. సీజేగా జస్జిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారాని సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీజే ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తూ మూడు రోజుల క్రితమే రాజ్ భవన్ నుంచి ప్రగతి భవన్ కు ఆహ్వానం వెళ్లింది. దీనిపై సీఎంవో నుంచి రాజ్ భవన్ కు సోమవారం సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో రాజ్ భవన్ కు కేసీఆర్ రావకపోవచ్చనే ప్రచారం జరిగింది. హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి హాజరుకాకుంటే దేశ వ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వస్తున్నారని సీఎంవో నుంచి సమచారం వచ్చింది.

కొంతకాలంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమె ఆహ్వానం అందడం లేదు. జిల్లాలకు వెళ్లినా మంత్రులు పట్టించుకోలేదు. తనకు అవమానం జరుగుతోందని గవర్నర్ తమిళి సై స్వయంగా చెప్పుకున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయినా గవర్నర్ పట్ల కేసీఆర్ తీరు మారలేదు. హైదరాహద్ కు ప్రధాని మోడీ వచ్చినా సీఎం కేసీఆర్ ఆహ్వానం పలకలేదు. ప్రధాని పర్యటనలో గవర్నర్ ఉంటారు కాబట్టి.. ఆమెతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే కేసీఆర్ డుమ్మా కొట్టారనే ప్రచారం జరిగింది. వరుసగా జరుగుతున్న కార్యక్రమాలతో రాజ్ భవన్ , ప్రభుత్వం మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది.

తాజాగా రాజ్ భవన్ కు కేసీఆర్ రావడం.. గవర్నర్ తమిళిసైతో సమావేశం కావడంతో.. ఇద్దరి మధ్య  విభేదాలు సమసిపోయినట్టేనా అన్న చర్చ సాగుతోంది. సీజే ప్రమాణ స్వీకారాని రాకపోతే విమర్శలు వస్తాయనే సీఎం కేసీఆర్ వచ్చి ఉంటారని.. గవర్నర్ తో ఆయన తీరు మారకపోవచ్చనే వాదన కొన్ని వర్గాల నుంచి వస్తోంది. బీజేపీపై దూకుడుగా వెళుతున్న కేసీఆర్.. గవర్నర్ విషయంలోనూ అదే తీరులో వెళతారని టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

Also Read: Mythri Movie Makers: అదిరిపోయే ప్లాన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఆ మలయాళ హీరోతో క్రేజీ మూవీ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News