CM KCR writes to PM Modi: ప్రాంతీయ భాషలో పరీక్షలపై ప్రధాని, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Last Updated : Nov 20, 2020, 07:41 PM IST
CM KCR writes to PM Modi: ప్రాంతీయ భాషలో పరీక్షలపై ప్రధాని, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 

కేంద్రం పరిధిలో ఉండే అన్ని విభాగాలు, యూపీఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్‌బీఐ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్ పరీక్షలు హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహిస్తుండటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదువుకోని అభ్యర్థులు, హిందీ తెలియని ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కేంద్ర నియామకాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని సీఎం కేసీఆర్ తన లేఖ ద్వారా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ( PM Modi, President Ram Nath Kovind ) దృష్టికి తీసుకెళ్లారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు లభించాలంటే.. ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Trending News