TS EAMCET 2020 షెడ్యూలు వచ్చేసింది

తెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్ విడుదలైంది. దరఖాస్తు తేదీలతో పాటు పరీక్ష తేదీల వివరాలను అధికారులు వెల్లడించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 16, 2020, 06:30 AM IST
TS EAMCET 2020 షెడ్యూలు వచ్చేసింది

హైదరాబాద్:  తెలంగాణ ఎంసెట్-2020 షెడ్యూలు వచ్చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 19న ఎంసెట్-2020 (TS EAMCET - 2020) నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలైన రెండో రోజు నుంచి అంటే ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులు మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెల 4వ తేదీ నుంచి 11 వరకు వారం రోజులపాటు తెలంగాణ ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

TS EAMCET-2020 నిర్వహణ బాధ్యతల్ని  జేఎన్‌టీయూ హైదరాబాద్ (JNTUH) చేపట్టిన విషయం తెలిసిందే. మార్చి 30 తర్వాత దరఖాస్తు చేసుకునే విద్యార్థుల నుంచి లేట్ ఫీ (ఆలస్య రుసుము) వసూలు చేయనున్నారు. 06-04-2020 లోపు రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 ఆలస్య రుసుముతో 13-04-2020 లోగా, రూ.5000 ఆలస్య రుసుముతో 20-04-2020 లోగా, రూ.10,000 ఆలస్య రుసుముతో 27-04-2020 తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.

ఈ సారి Economically Weaker Section (EWS) కోటా ఆప్షన్‌ను అప్లికేషన్‌‌లోనే పొందుపరిచారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయితే దరఖాస్తులో ఆప్షన్ ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆ ఆప్షన్‌‌ను టిక్ చేయాలి.

TS EAMCET - 2020 Schedule:

నోటిఫికేషన్ జారీ: 19-02-2020

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21-02-2020

దరఖాస్తుకు చివరితేది: 30-03-2020.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు 

ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ పరీక్ష తేదీలు:  04-05-2020, 05-05-2020, 07-05-2020

అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు: 09-05-2020, 11-05-2020.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News