Lands regularization: రూ.1000 చెల్లిస్తే ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ!

Lands regularization: ప్రభుత్వం భూములను ఆక్రమించి.. ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 చెల్లించి భూమిని రెగ్యులరైజ్ చేసుకోవచ్చని తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2022, 10:32 AM IST
  • భూముల క్రమబద్దీకరణ విషయలో ప్రభుత్వం మరో వెసులుబాటు
  • 125 గజాల ఆక్రమిత భూమికి ఉచితంగా రెగ్యులరైజేషన్​
  • మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
Lands regularization: రూ.1000 చెల్లిస్తే ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ!

Lands regularization: భూముల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి.. ఆ భూమిని తమ పేరుపై క్రమ బద్దీకరించేందుకు మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం.

ఇందులో భాగంగా ఈ నెలలో జీవో 58, 59లను తీసుకొచ్చింది ప్రభుత్వం. తాజాగా ఈ జీవోలను అనుసరిస్తూ.. భూముల క్రమ బద్దీకరణ దరఖాస్తు విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

కొత్త వెసులుబాట్లు ఏమిటంటే..

ఆక్రమిత భూమిలో ఇళ్లు కట్టుకున్న వారు.. ప్రభుత్వం నిర్ణయించిన భూమి విలువలో 12.5 శాతాన్ని చెల్లించాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇందుకు బదులు దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1000 చెల్లించాలని తెలిపింది. 125 గజాల భూమిని ఆక్రమించుకున్న వారికి మాత్రమే ఈ నిబంధన వర్తించనుందని తెలిసింది.

దరఖాస్తు ఎలా?

సమీప మీ సేవ కేంద్రాలన్నింటిలో భూముల క్రమ బద్దీకరణకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం వ్యక్తిగత ధృవ పత్రాలతో పాటు.. ఆక్రమిత భూమి తమ ఆధీనంలోనే ఉంది అనేందుకు ఏవైనా గుర్తింపు పత్రాలు గానీ, ఆ భూమిలో నిర్మించుకున్న ఇళ్లు ఫొటోలు గానీ, నాలా కనెక్షన్ బిల్లుగానీ.. దరఖాస్తు సమయంలో సమర్పించాలని తెలిపింది ప్రభుత్వం. మార్చి 31 దరఖాస్తుకు చివరి తేదీ అని స్పష్టం చేసింది.

ఎవరెవరికి వర్తించనుంది?

ప్రభుత్వం భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఈ కొత్త రూల్స్ వర్తించనున్నాయి. 2014 జూన్​ 2 కన్నా ముందు ఆక్రమణకు గురైన భూములకు మాత్రమే క్రమబద్ధీకరించుకునే వీలుంది.

125 నుంచి 250 గజాల వరకు ఆక్రమిత భూమి రెగ్యులరైజేషన్ కోసం దాని విలువలో (ప్రభుత్వ రేటు) 50 శాతం చెల్లించాలి. 250 నుంచి 300 గజాల భూమిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటులో 75 శాతం ప్రభుత్వానికి చెల్లించి క్రమబద్దీకరించుకోవచ్చు. 300 గజాలకన్నా ఎక్కువ భూమి, ఇళ్లు నిర్మించుకునేందుకు కాకుండా ఇతర అవసరాలకోసం వాడుకుంటున్న భూమిని క్రమబద్దీకరించుకోవాలటే.. 100 శాతం విలువను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Also read: CM KCR: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

Also read: KCR-Uddhav Thackeray: కేసీఆర్-ఉద్దవ్ ఠాక్రే జాయింట్ ప్రెస్ మీట్.. ఏం చెప్పారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News