గుడ్ న్యూస్: ఆసరా పింఛన్లు  ఇక నుంచి రెట్టింపు !!

పింఛన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Last Updated : May 28, 2019, 05:49 PM IST
గుడ్ న్యూస్: ఆసరా పింఛన్లు  ఇక నుంచి రెట్టింపు !!

తెలంగాణ ప్రభుత్వం సామాజిక పింఛన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  ఆసరా పథకం కింద అందించే పింఛన్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఇక నుంచి దివ్యాంగులకు నెలకు రూ.3016... మిగతా లబ్ధిదారులకు నెలకు రూ.2016 చొప్పున ఇవ్వనున్నారు. పెరిగిన ఈ పింఛన్లను జూన్‌ నెల నుంచి అమలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న  తాజా నిర్ణయం వల్ల తెలంగాణలో 46 లక్షల మంది లబ్ధి చేకూరనుంది. ఆసరా పథకం ద్వారా ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ.1500 ఇస్తుండగా.. ఇక నుంచి నెలకు రూ. 3016 చొప్పున ఇవ్వనున్నారు. అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్, బోదకాలు బాధితులకు నెలకు రూ.1000 చొప్పున ఫించన్లు ఇస్తుండగా ఇక నుంచి వీరు ప్రతి నెలా రూ.2,016ను ఫించన్‌గా ఇస్తారు. 
 

Trending News