Telangana: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జరిపిన సమీక్షలో పరీక్షల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్ని గత ఏడాదితో పోలిస్తే త్వరగా నిర్వహించనుంది. ఇప్పటికే పరీక్షల టైమ్ టైబుల్ కూడా విడుదలైంది. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు మార్చ్ నెలలోనే పూర్తి కానున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పదవ తరగతి, ఇంటర్ పరీక్షల తేదీపై దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసిన విద్యా శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తరువాత అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ దాదాపుగా నిర్ణయమైంది. జనవరిలో ప్రీ ఫైనల్, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ జరగనున్నాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు కొత్తగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. అంటే ఇక నుంచి ఇంగ్లీషు థియరీ 80 మార్కులకు, ప్రాక్టికల్స్ 20 మార్కులకు ఉంటుంది.
ఇక ఇంటర్ పరీక్షలు ముగియగానే అదే 18వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కట్టుదిట్టంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook