సెలవు లేదు.. రేపు పనిదినమే

ఈ రెండో శనివారం సెలవు రద్దు చేసిన తెలంగాణ సర్కార్

Last Updated : Feb 9, 2018, 10:02 PM IST
సెలవు లేదు.. రేపు పనిదినమే

సాధారణంగా ప్రతీ రెండో శనివారం పలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినం అనే సంగతి తెలిసిందే. అయితే, రేపటి రెండో శనివారం మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

జనవరి 1వ తేదీని సెలవుగా ప్రకటించినందున, ఈ నెల రెండో శనివారాన్ని( 10వ తేదీ) పనిదినంగా పరిగణిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులతో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి.

Trending News