తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరికొన్ని జాగ్రత్తలను సూచించింది. కాగా ఈ దఫాలో చాలా మేరకు సడలింపులిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా పోలీసులు కొత్త ట్రాఫిక్ నియమాలు ప్రవేశపెట్టనున్నారు.

Updated: May 21, 2020, 06:27 PM IST
తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే..

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 (Lock Down 4.0) కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరికొన్ని జాగ్రత్తలను సూచించింది. కాగా ఈ దఫాలో చాలా మేరకు సడలింపులిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా పోలీసులు కొత్త ట్రాఫిక్ నియమాలు ప్రవేశపెట్టనున్నారు. ఇకపై ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌ కఠినంగా వ్యవహరించనుందని, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన నాటి నుండి నియమాలు అతిక్రమించే వారికి అతిక్రమించేవారి కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Also Read:  హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం..

మరోవైపు ఇకముందు బైక్ నడిపేవారితో పాటు వెనక కూర్చున్న వారు ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందేనని, ఉల్లంఘనకు పాల్పడితే భారీ స్థాయిలో జరిమానాలు విధించబడుతాయాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. మొదటిసారి నియామాలు ఉల్లంఘిస్తే రూ. 100, రెండోసారి రూ. 300 జరిమానా విధించబడుతుందన్నారు. కాగా, ప్రజలు పూర్తిస్థాయి హెల్మెట్లను వాడాలని, కొత్త నియమ నిబంధనలు పౌరుల రక్షణ కోసమేనని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..