Good News For Telangana Govt Employees: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రోజుకు ఒక శాఖ లేదా ప్రభుత్వ విభాగం నేతృత్వంలో ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. ఉత్సవాలు చివరికి వస్తున్న క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ అందించనున్నట్టు ప్రకటించి వారికి తీపి కబురు అందించింది. ఈ మేరకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ అయ్యాయి అని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పే పై 2.73% డిఏ విడుదల చేయనుంది. అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్‌పై 2.73% డియర్‌నెస్ రిలీఫ్ లభించనుంది. జూన్ 2023 నుండే అమల్లోకి రానున్న ఈ డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ జూలై 2023లో వేతనంతో కలిపి చెల్లించనున్నారు.
As part of Telangana State Decennial Celebrations, on Hon‘ble CM KCR garu’s directions, Telangana govt released one instalment of Dearness Allowance to the state government employees and Dearness Relief to the Pensioners @ 2.73% on the basic pay / pension.
The DA/DR will be… pic.twitter.com/eTZfAbem6f
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2023
ఇది కూడా చదవండి : Rythu Bandhu Scheme 2023 June: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు డబ్బుల విడుదలకు కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. లబ్ధిదారుల సంఖ్యా పరంగా చూస్తే .. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7 లక్షల 28 వేల మందికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది అని తెలంగాణ సర్కారు స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : TS Government New Scheme: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 15న లక్ష సాయం.. ఇలా అప్లై చేసుకోండి!
ఇది కూడా చదవండి : Siddipet IT towers: కలలో కూడా అనుకోలేదు : మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK