కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) విద్యాసంస్థల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో విద్యా సంస్థలు తెరవడం మంచిది కాదని భావిస్తోంది. ఈ సందర్భంగా నేడు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ విద్య ( Online Education ), డిజిటల్ క్లాసుల ( Digital Classes ) అంశంపై ఒక క్లారిటీ రానుంది. మరో వైపు ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలు తెరుచుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
Read This Article: Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూల్ విద్యార్థుల కోసం డీడీ యాదగిరి ( DD Yadagiri ), టీ-శాట్ (T-SAT ) ఛానెళ్ల ద్వారా వీడియో క్లాసులు నిర్వహించనున్నారు అని తెలుస్తోంది. నేటి తెలంగాణ క్యాబినెట్ ( Telangana Cabinet Meeting ) సమావేశంలో వీటికి సంబంధించి తేదీలను, షెడ్యూల్ ను ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఆగస్టు 17 నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి అని సమాచారం.
Read This Article: Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది