Telangana Inter Hall Tickets 2024: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇవాళ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. విద్యార్ధులే నేరుగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చు. ఈ నెల 28 నుంచి మార్చ్ 19 వరకూ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 9.8 లక్షల మంది పరీక్షలు హాజరౌతునారు. ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షల కోసం 1521 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్
tsbie.cgg.gov.in. ఓపెన్ చేసి మీ పుట్టిన తేదీ లేదా గత సంవత్సరం హాల్ టికెట్ వివరాలు ఎంటర్ చేస్తే చాలు మీ హాల్ టికెట్ కన్పిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
ఇంటర్ మొదటి సంవత్సరం టైమ్ టేబుల్
ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 1న ఇంగ్లీషు
మార్చ్ 4న మేధ్స్-బోటనీ-పొలిటికల్ సైన్స్
మార్చ్ 6న మేధ్స్-జువాలజీ-హిస్టరీ
మార్చ్ 11న ఫిజిక్స్-ఎకనామిక్స్
మార్చ్ 13న కెమిస్ట్రీ-కామర్స్
మార్చ్ 15న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-బ్రిడ్జి కోర్సు మేథ్స్-1
మార్చ్ 18న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ-1
ఇంటర్ సెకండ్ ఇంయర్ పరీక్షల టైమ్ టేబుల్
ఫిబ్రవరి 29న సెకెండ్ లాంగ్వేజ్
మార్చ్ 2న ఇంగ్లీషు
మార్చ్ 5న మేథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చ్ 7న మేధ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 12న ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 14వతేదీన కెమిస్ట్రీ, కామర్స్
మార్చ్ 16న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మేధ్స్-2
మార్చ్ 19న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
Also read: CM Revanth Reddy: అసెంబ్లీలో సబితకు చుక్కలు.. అక్కా.. అంటూనే కడిగేసిన సీఎం రేవంత్ రెడ్డి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook