Srikantha Chary Father: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి మిస్సింగ్..? పోలీసులకు శంకరమ్మ ఫిర్యాదు

Srikantha Chary Father Missing:  తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి మిస్సింగ్ కలకలం రేపుతోంది. వెంకటాచారి భార్య శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించి ఆయన మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 08:39 AM IST
  • తన భర్త వెంకటాచారి కనిపించట్లేదంటూ పోలీసులకు శంకరమ్మ ఫిర్యాదు
  • కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిన శంకరమ్మ
  • శంకరమ్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Srikantha Chary Father: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి మిస్సింగ్..? పోలీసులకు శంకరమ్మ ఫిర్యాదు

Srikantha Chary Father Missing: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా వెంకటాచారి కనిపించట్లేదంటూ ఆయన భార్య శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 1న వెంకటాచారి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకెళ్లారని... ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బహుశా ఆయన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. శంకరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇటీవల వెంకటాచారి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. శ్రీకాంతచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న భారీ సభ నిర్వహిస్తామని... తెలంగాణ అసలైన ఆవిర్భావ దినోత్సవం అదేనని ప్రకటిస్తామన్నారు. ఈ సందర్బంగా వెంకటాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరులకు న్యాయం జరగాల్సి ఉందన్నారు. కేఏ పాల్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తెలంగాణలో కేఏ పాల్ సారథ్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

ప్రజాశాంతి పార్టీలో వెంకటాచారి చేరిక తర్వాత ఆయన భార్య శంకరమ్మ కేఏ పాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని ఒత్తిడి తెచ్చి వెంకటాచారిని పార్టీలో చేర్చుకున్నారని కేఏ పాల్‌పై ఆరోపణలు చేశారు. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తితో ఇందుకోసం రాయబారం నెరిపారని అన్నారు. తన భర్తను కలిసేందుకు వెళ్తే.. ఆయన తనతో వచ్చేందుకు ఇష్టపడట్లేదని చెప్పి పాల్ మనుషులు నన్ను తిప్పి పంపించారని వాపోయారు. వెంకటాచారిని పాల్ మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వెంకటాచారి కనిపించట్లేదంటూ శంకరమ్మ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Kodali Nani: కొడాలి నాని, వల్లభనేని వంశీపై మహిళను వేధించిన కేసు!

Also Read: Horoscope Today June 12th : రాశి ఫలాలు... ఇవాళ ఏయే రాశుల వారికి శుభప్రదం.. ఎవరికి ఏ విషయంలో మంచి జరుగుతుందో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News