Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..

Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాలోచనలు జరిపారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 25, 2024, 10:35 AM IST
Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..

Telangana PCC: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటు సీఎంగా.. పీసీసీ సారథిగా ఉన్నారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి ఒదులుకొని వేరే వారికీ కేటాయించాలి. మధ్యలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రేవంత్ రెడ్డినే కొనసాగించింది పార్టీ హై కమాండ్. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు పూర్తై మూడు నెలలు కావొస్తోన్న కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు.  రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతులు చేపట్టి దాదాపు 9 నెలలు పూర్తవుతోన్న ఇప్పటికీ తెలంగాణకు కొత్త పీసీసీ సారథి ఎంపికపై పార్టీ ఓ నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈ విషయమై రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర బృందం వేర్వేరు అభిప్రాయాలు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పీసీసీ కొత్త అధ్యక్షుడతో పాటు  మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా ఇంకా దీనిపై ఓ కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం నలుగురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌లలో నలుగురికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. శ్రీహరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని  రేవంత్‌రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. తాము తిరిగి పార్టీలో చేరేటప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ చెబుతున్నట్లు తెలిసింది. అయితే.. ఇప్పటికే మంత్రి వర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉండటంతో ఈయనకు మంత్రిగా ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.  

మరోవైపు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరూ లేరు. పార్టీ సీనియర్‌ నాయకుడు సుదర్శన్‌రెడ్డికి కచ్చితంగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డిలు ఎక్కువగా ఉన్నారు. పైగా పార్టీకి రెడ్డి ముద్ర ఉండనే ఉంది.ఇలాంటి సమయంలో సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.  మరో సీనియర్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా గట్టిగా పోటీపడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిలలో ఒకరికే అవకాశం లభిస్తే.. మల్‌రెడ్డికి ాన్స్ ఉండకపోవచ్చు.  ప్రేమ్‌సాగర్‌రావు కోసం మరో ముఖ్యనేత పట్టుబడుతున్నట్లు తెలిసింది. మదన్‌మోహన్‌రావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మైనార్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ క్యాబినేట్ లో మైనారిటీలో ఎవరు లేరు.
 
పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాస్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్‌కుమార్, లక్ష్మణ్‌కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్‌ పేర్లను కాంగ్రెస్ హై కమాండ్  పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలమైన వ్యక్తికే పీసీసీ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాంనాయక్‌కు ఇచ్చే అవకాశం ఉంది. బీసీలకైతే మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేరు ఎక్కువ గా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌ విప్‌.. ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x