TS Police Exams New Dates: తెలంగాణ పోలీసు ఉద్యోగాల పరీక్షల తేదీల మార్పు

TS Police Exams New Dates: తెలంగాణ పోలీసు కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) ఉద్యోగాలకు నిర్వహించనున్న పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో ఈ మార్పులుచేర్పులు చేసినట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ తేల్చిచెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2023, 06:25 AM IST
TS Police Exams New Dates: తెలంగాణ పోలీసు ఉద్యోగాల పరీక్షల తేదీల మార్పు

TS Police Exams New Dates: హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు నిర్వహించనున్న పరీక్షల తేదీలను మార్చినట్టు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరగాల్సి ఉండగా.. అందులో మార్పులుచేర్పులు చేసినట్టు తాజాగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టంచేసింది. 

ఇందులో మార్చి 12న జరగాల్సి ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలను ఒక్క రోజు ముందుకు కుదించి మార్చి 11వ తేదీనే నిర్వహించనున్నారు. 

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) ఉద్యోగాలకు నిర్వహించనున్న పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో ఈ మార్పులుచేర్పులు చేసినట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్ తేల్చిచెప్పింది.

ఇది కూడా చదవండి : TS Tenth Exams: తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, పదవ తరగతి పరీక్షల్లో పెరిగిన ఛాయిస్

ఇది కూడా చదవండి : Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఇది కూడా చదవండి : TS High Court: సోమేష్ కుమార్‌కు చుక్కెదురు, ఏపీకు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News