Telangana Politics: ఆ లీడర్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి.. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ నాయకుడే హాట్ టాపిక్..

Telangana Politics: రాజకీయాల్లో ఆయనో సీనియర్ ఎమ్మెల్యే అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన అనుభవం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక హవా కొనసాగించి ఆయన తెలంగాణ వచ్చాక మాత్రం సైలైంట్ గా ఉండి పోయారు. కానీ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరే మారింది. తనలో ఉన్న  పాత క్యారెక్టర్ ను మళ్లీ పరిచయం చేస్తున్నాడని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ కొనసాగుతుంది. ఇంతకీ ఎవరా లీడర్ ..? ఏంటా ఆయన పాత క్యారెక్టర్ ..

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 3, 2024, 08:09 AM IST
Telangana Politics: ఆ లీడర్ లో మస్తు షేడ్స్ ఉన్నాయి.. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ నాయకుడే హాట్ టాపిక్..

Telangana Politics: రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము. పరిస్తితులను బట్టి మసులుకోవడం కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి  కోవకు చెందిన లీడర్ ఒకరున్నారు. పాలిటిక్స్ లో ఆయన  ఓ సీనియర్. మంత్రిగా,  ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం. కానీ ఆయనలోఎన్నెన్నో షేడ్స్ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో  ఒక కీలక శాఖకు మంత్రిగా కూడా ఉన్నారు. అంతే కాదు హైదరాబాద్ నగరంలో తన మార్క్ పాలిటిక్స్ కూడా చేసే వారు. హైదరాబాద్ స్టైల్ లో ధమ్కీలు ఇవ్వడంలో తన స్టైలే వేరు. గతంలో హైదరాబాద్ లో చెందిన పెద్ద నేత మరణం తర్వాత ఈయనకు తిరుగు లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే  ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో తనది కొనసాగిన హవా అంతా ఇంతా అని చెప్పలేం. ఒక వైపు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్నా తను మాత్రం ఏమీ పట్టనట్లు ఉన్నారు. తను హైదరాబాద్ కు మాత్రమే సంబందించిన వాడిని ఉద్యమంతో తనకు సంబంధం లేదనే ధోరణితో ఉండే వాడు. అంతే కాదు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. తనను అడ్డుకుందామనుకున్న టీఆర్ఎస్ విద్యార్థి నాయకులను కూడా తరిమి కొట్టిన చరిత్ర అతనిది.  తెలంగాణ సమాజం అంతా కూడా అప్పట్లో ఆయనను విరోధిగా భావించేది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యే వరకు హవాను కొనసాగిస్తూ వచ్చారు.

అయితే రోజులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు కదా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తను ఏ పార్టీ మీదనైతే అంతెత్తున ఎగిరేవాడో ఆ పార్టీయే అధికారంలోకి వచ్చింది. అంతే కాదు తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత కొద్ది రోజులు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ లోగా 2019 ఎన్నికలు వచ్చాయి. పదవుల అనుభవించిన ఆయనకు సైలెంట్ గా ఉండడం పెద్దగా నచ్చనట్లు ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారు. అనకున్నదే తడువుగా తన సన్నిహితులతో ఆ పార్టీ పెద్దలకు రాయబారం పంపారు. టీఆర్ఎస్ కూడా పాత సంఘటనలు అన్నీ పక్కన పెట్టి  ఆ నాయకుడిని పార్టీలో చేర్చుకుంది. అంతే కాదు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున టికెట్ ఇవ్వడంతో తిరగి ఎమ్మెల్యేగా అయ్యారు.  టీఆర్ఎస్ లో చేరిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మాత్రం పార్టీలో బాగానే కలిసిపోయారు. టీఆర్ఎస్ పెద్దలతో మంచి సంబంధాలను ఏర్పర్చుకొని పార్టీలో సెట్ అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా , తెలంగాణ భవన్ లో ఏ కార్యక్రమం జరిగినా ఆ నేతదే హల్ చల్. ఆ పార్టీ కూడా హైదరాబాద్ లో ఆ నాయకుడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. ఇలా ఎమ్మెల్యేగా తన జోరు కొనసాగించారు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదే క్రమంలో మరో సారి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరుపున పోటీకీ నిలబడి గెలిచారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ నాయకుడి ఆలోచనలు మారాయి. తాను గతంలో పని చేసిన పార్టీయే అధికారంలోకి రావడంతో ఆ పార్టీ వైపే వెళితే బాగుటుందని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయనకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కింది కానీ.. ఆయన ఓడిపోయారు. అయితే ఆ నాయకుడు కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తన ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. తన నాయకుడిలో మళ్లీ పాత వ్యక్తిని చూస్తున్నామంటున్నారు. గత పదేళ్లుగా ఎప్పుడూ చూడని దూకుడు మళ్లీ చూస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అంతే కాదు ఆ నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీనీ విమర్శించడంలో కూడా తన రూటే సపరేట్ అన్నట్లు గా మారిపోయారు.

తాజాగా అసెంబ్లీలో సదురు నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను  మీ అంతు చూస్తామని అసెంబ్లీ వేదికగా బెదిరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏంటీ ఈయన ఇంతలా రెచ్చిపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఇలా ఆ నాయకుడు మాట్లాడం చూశామని మళ్లీ ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనకుంటున్నారు. కొంపదీసి తను ఏదైనా పెద్ద పదవి ఆశించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడడానికి ఇలా చేశారా అన్న చర్చ జరగుతుంది. అసలే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో సదురు సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇలాంటి చర్చకు దారితీశాయి. అంతే కాదు అసలే హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అందునా ఆ నేతకు హైదరాబాద్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆ నేత ఇలా మాట్లాడారనే టాక్ నడుస్తోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

మరోపక్క..ఆ నేత తీరుపై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసలు ఆయన ఈ రోజు రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్నాడంటే బీఆర్ఎస్ కదా..అలాంటి బీఆర్ఎస్ పై ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తను తీరు సరిగ్గా లేకున్నా...తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీలో చేర్చుకొని తనకు పార్టీ అండగా నిలబడిందని చెబుతున్నారు. అలాంటి పార్టీ ఎమ్మెల్యేలను బయట తిరగనివ్వం అని బెదిరింపులకు దిగడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఆ నాకుడి తీరు చూసిన జనం మాత్రం తన ఒరిజనల్  క్యారెక్టర్ ను బయటపెట్టారని అంటున్నారు. మరి ఆ నాయకుడి ఏం ఆశించి ఈ కామెంట్స్ చేశారో తెలియదు కానీ పాలిటిక్స్ లో మాత్రం అతను హాట్ హాట్ గా మార్చారు.

Also Read: Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్‌ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News