Telangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!

Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు. ముఖ్యంగా  హరీష్ రావునే టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 27, 2024, 07:42 PM IST
Telangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను  ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!

Telangana Politics:రాజకీయం అంశం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు , ప్రతి సవాళ్లు, కౌంటర్లు, ఎన్ కౌంటర్లు ఇలా గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. రెండు పార్టీలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. చూసుకుందాం  మీ ప్రతాపం మా ప్రతాపం అంటూ  నేతలు తొడలు కొడుతున్నారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు అనే వాటిని అస్త్రాలుగా చేసుకొని కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అసలే ఎన్నికల ఓటమితో డీలా పడ్డ కేసీఆర్ ను అవినీతి ఆరోపణలతో మోరల్ గా దెబ్బతీస్తే బీఆర్ఎస్ మరింత దెబ్బతింటుందని కాంగ్రెస్ భావించింది. దానిలో భాగంగా కేసీఆర్ కు సంబంధించిన ఏ చిన్న అంశం దొరికినా  రేవంత్ సర్కార్.. కేసీఆర్ రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా వ్యూహాలు రచించింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు కేసీఆర్ ను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఒక దశలో కేసీఆర్ ను వ్యక్తిగతంగా కూడా అవమానించేలా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విమర్శలకు దిగారు. కేసీఆర్ ను ఎంత దెబ్బతీస్తే బీఆర్ఎస్ ను అంత దెబ్బతీయవచ్చు అని కాంగ్రెస్ భావించింది. చివరకు కేసీఆర్ అసెంబ్లీకీ రాకపోవడాన్ని కూడా తప్పుపడుతూ ప్రజల్లో కేసీఆర్ ను ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఒక రకంగా కాంగ్రెస్ ఈ విషయంలో సక్సెస్ అయ్యింది.

అయితే తాజాగా కాంగ్రెస్ వ్యూహం మార్చింది, కేసీఆర్ గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉండడంతో కేసీఆర్ ను కాదని బీఆర్ఎస్ లో మరో అత్యంత కీలక నేతను ఇప్పుడు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కు ఆ లీడర్ తో రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారినట్లు భావిస్తుంది. తనను అలానే వదిలేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవనుకుంటుంది. అందేకే రూట్ మార్చి కేసీఆర్ ను కాదని ఆ లీడర్ ను టార్గెట్ చేసింది. తెలంగాణలో తన కంటూ ఒక  పాజిటివ్ ఇమేజ్ ఉన్న లీడర్ హరీష్ రావు కావడంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడమే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహంగా కనపడుతుంది
బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు . గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ హరీష్‌ రావును టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ తో పాటు తెలంగాణలో పవర్ ఫుల్ లీడర్ గా ఉన్న హరీష్ రావును పొలిటికల్ గా కంట్రోల్ చేయాలనేదే కాంగ్రెస్ కాదు కాదు రేవంత్  ముందున్న లక్ష్యమట. కాంగ్రెస్ కు హరీష్ రావు కంటిలో నలుసుగా మారాడనేది గాంధీ భవన్ వర్గాల టాక్. మంచి మాటకారి, అన్ని అంశాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు. అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడే లీడర్ ఇదే ఆయనను కాంగ్రెస్ టార్గెట్ చేసేలా చేసింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే హరీష్‌ రావు కాంగ్రెస్ ను కొంత ఇబ్బంది పెట్టారు.  బీఆర్ఎస్ హయాంలో వివిధ రంగాల్లో ఏం జరిగింది అనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రాలను ప్రవేశపెట్టింది. శ్వేతపత్రాలతో బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతామనుకున్న కాంగ్రెస్ కు అనుకున్న స్థాయిలో మైలేజీ రాలేదు. కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన హరీష్‌ రావు తన దైన శైలిలో అసెంబ్లీలో కౌంటర్లు ఇచ్చారు. బీఆర్ఎస్ తరుపున ఒక్కరే కాంగ్రెస్ నేతలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. నాటి నుంచే హరీష్‌ రావుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాగైనా హరీష్‌ రావును కంట్రోల్ చేయాలనే ఆలోచనలు మొదలు పెట్టింది

రాజకీయంగా హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్. దీంతో హరీష్‌ రావు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. దానిలో భాగంగానే ఉద్యమ సమయంలో పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యా యత్నం చేసిన సందర్భాన్ని కాంగ్రెస్ రాజకీయంగా వాడుకునే పనిలో పడింది. పెట్రోల్ బాటిల్ సరే మరి అగ్గిపెట్టె సంగతి ఏంటి అని వ్యక్తిగతంగా హరీష్‌ రావును టార్గెట్ చేసింది. అగ్గిపెట్ట హరీష్ రావు అంటూ అసెంబ్లీతో పాటు పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్తిస్తుంటారు.

ఇటీవల రుణమాఫీ విషయంలో హరీష్‌ రావును కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ రుణమాఫీ చేసి చూపెట్టింది. మరి నీ రాజీనామా ఎక్కడా అంటే సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు నేతలు హరీష్‌ రావుపై విమర్శలు గుప్పించారు. అంతే కాదు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హరీష్ రావు నీ రాజీనామా ఎక్కడ అంటూ మైనంపల్లి హనుమంత రావు అభిమాన సంఘం పేరుతో హోర్డింగ్స్ కూడా వెలిసాయి. కాంగ్రెస్ హరీష్ ను టార్గెట్ చేయడానికి  మైనంపల్లిని వాడుకుంటుందనే గుసగుసలు వినపడుతున్నాయి. గత కొద్దేళ్లుగా హరీష్‌ రావు, మైనంపల్లి మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యం ఉంది. దీంతో  హరీష్‌ రావుపై  మైనంపల్లిని కాంగ్రెస్ ప్రయోగిస్తుందనే ప్రచారం ఉంది.

తాజాగా హరీష్‌ రావు సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ హల్ చల్ చేస్తుంది. ఏకంగా హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై ఉన్న పోస్టర్లను కాంగ్రెస్ క్యాడర్ చించేసింది. ఒక రకంగా హరీష్‌ క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ దాడి చేసినంత పని చేసిందని అనుకోవచ్చు. హరీష్‌ ను వీలైనంత మోరల్ గా దెబ్బతీయడమే కాంగ్రెస్ ఉద్దేశంగా తెలుస్తుంది. హరీష్‌ రావు ఒక్కడిన కంట్రోల్ చస్తే బీఆర్ఎస్ మరింత వీక్ అవుతుందనే కాంగ్రెస్ ఆలోచన. భవిష్యత్తులో హరీష్‌ రావుపై మరింత ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందనేది పొలిటికల్ సర్కిల్ లో టాక్.

కాంగ్రెస్ నుంచి ఇంత స్థాయిలో పొలిటికల్ అటాక్ జరుగుతున్న ట్రబుల్ షూటర్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. కాంగ్రెస్ నుంచి జరుగుతున్న రాజకీయ దాడులను భయపడేది లేదని. ఇలాంటివి ఎన్నో చూశామని . ప్రజల తరుపున కాంగ్రెస్ పై తన పోరాటం ఆగదని హరీష్‌ రావు స్పష్టం చేస్తున్నారు.

(ఇందుప్రియాల రాధాకృష్ణ)

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News