Telangana Politics: కీలక జిల్లాలోని ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు గోడ దూకేస్తున్నారా...?

Telangana Politics: ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది. ముగ్గురు కీలక నేతలు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు ఇప్పుడు పార్టీ వీడడానికి సిద్దపడుతున్నారా.. ? బీజేపీకీ చెందిన ఒక కీలక నేతతో వీళ్లు సంప్రదింపులు జరుపుతున్నారా...ఇంతకీ ఎవరా ఆ ముగ్గరు ..?

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 12, 2024, 05:55 AM IST
Telangana Politics: కీలక జిల్లాలోని ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు  గోడ దూకేస్తున్నారా...?

Telangana Politics: ఒకప్పుడు ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉండేది. అందునా ఉమ్మడి కరీనంగర్ జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ కంట్రోల్ లో ఉండేది. అలాంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ కు పెద్ద కష్టమే వచ్చి పడుతుంది. మొన్నటి ఎన్నికల తర్వాత ఘోర ఓటమి నుంచి ఇంకా పార్టీ కోలుకోవడం లేదు. ఉద్యమం కాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకు కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అనేలా ఉండేది. అలాంటి కరీంనగర్ లో మొన్నటి ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ నే ఇచ్చాయి. కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. జిల్లాలోని అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీలతో గెలిచింది. ఒక విధంగా ఈ ఫలితాలను బీఆర్ఎస్ అధిష్టానం ఏ మాత్రం ఊహించ లేదు. అయితే తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కరీంగనగర్ స్థానంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఎన్నికల్లోను బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా బీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసినా కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి చవి చూసింది. దీంతో పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం గులాబీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ కవిత కు బంటుగా భావించే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది అసలు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ అస్సలు ఊహించలేదు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ను వీడడం ఏంటని పార్టీలో పెద్ద చర్చే జరిగింది.

ఇప్పుడు తాజాగా  బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు రాబోతున్నాయా అన్న చర్చ జరుగుతంది. పార్టీకీ చెందిన ముగ్గురు కీలక నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ వినబడుతుంది. ఈ మధ్య ఈ ముగ్గురు కూడా పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారని వాళ్ల అనచరులు చెబుతున్నారు. ఆ నేతల సైలెన్స్ వెనుక ఉన్న కారణాలేంటి అనేది పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట. వీళ్ల తీరు కాస్తా అనుమానంగా ఉందనే టాక్ నడస్తోంది. వీళ్లు గతంలో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన అత్యంత కీలక నేతతో వీరు ముగ్గురు కూడా టచ్ లో ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ ముగ్గురు కూడా ఆ కీలక నేతకు చాలా సన్నిహితులుగా మెదలినవారే. అందునా బీఆర్ఎస్ లో పని చేసిన నాటి నుంచి వీరందరి మధ్య ఇటు రాజకీయం, ఆర్థికంగా మంచి సంబంధాలు ఉన్నాయని జిల్లాలో టాక్. ఇప్పుడు అదే ఈ ముగ్గురు సైలెంట్ గా ఉండడానికి కారణం అని తెలుస్తుంది. వీరు త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ జోరందుకుంటోంది. ఆ కీలక నేత కూడా బీజేపీలోకి రమ్మని వారిపై ఒత్తిడి తెస్తున్నారట.

అసలే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం . బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటో తెలియని గందరగోళ స్థితిలో  ఏదో ఒక నిర్ణయం తీసకుంటేనే మంచిదనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట. అస్సలే ఒక పక్క విలీనం అనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి స్థితిలో మనమే పార్టీ మారితే ఎలా ఉంటుందా అని ఆ ముగ్గురు నేతలు కూడా తమ క్యాడర్ తో , సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారట. పార్టీ మారడానికి ఇదే మంచి సమయమని ..ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశలు ఉంటాయనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట. మరో పక్క ఇటు కాంగ్రెస్ కూడా గతంలో ఉన్న కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున  వాటి నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మార్పు ఒక్కటే ముందున్న ఆప్షన్ గా ఆ నేతల ఆలోచన ఉందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగో బీజేపీలో తమకు సంబంధించిన నేత కీలకంగా ఉన్నారు. ఆయన తమను చూసుకుంటారనే భరోసాతో వారు ఉన్నారట

ఇది ఇలా ఉంటే ఆ కీలక నేత కూడా ఈ ముగ్గురికి  వీలైనంత త్వరలో కాషాయ కండువా కప్పాలని అనుకుంటున్నారట. అసలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఇంకా బీజేపీ పార్టీపై ఇంకా పట్టుదొరకలేదనే టాక్ వినిపిస్తోంది. తన మనుషులు ఉంటే ఇంకా రాజకీయంగా బలపడవచ్చని ఆ నేత అనుకుంటున్నారట. అసలే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా..ఢిల్లీలో మాత్రం ఆ నేత తరుపున లాబీయింగ్ చేసే వారు లేకపోవడం పెద్ద మైనస్ గా మారిందట. దీంతో అధ్యక్ష పదవి దక్కకున్నా పార్టీలో తన కంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే ఈ ముగ్గురు నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న ఆ నేత ఒక మంచి సమయం చూసుకొని  ఢిల్లీ పెద్దల నడుమ కాషాయ కండువా కప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతానికి కరీంనగర్‌ జిల్లాపై ఫోకస్ పెట్టిన ఆ నేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను కూడా బీజేపీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవని అనిపిస్తుంది. పార్టీలో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం, క్యాడర్ మాత్రం పార్టీలో ఎవరు ఉన్నా పోయినా తమకేమీ నష్టం లేదని. భవిష్యత్తులో ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని అంటున్నారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x