Telangana Post Poll Suveys: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగుతున్నాయి. అందులో ఇప్పటికే 4 విడతల్లో 379 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అందులో ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో పాటు తెలంగాణలోని 25 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికలు ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవల్లో మాత్రం వేరుగా ఉందనేది పోస్ట్ పోల్ సర్వేస్ చెబుతున్నాయి. దాదాపు తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైనట్టు సర్వేలు చెబుతున్నాయి. ఒక మెదక్, మరో పార్లమెంట్ సీట్లలో మాత్రం బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానంలో మాత్రం ఏఐఎంఐఎం, బీజేపీ మధ్య హోరాహోరిగా సాగినట్టు సర్వేలు చెబుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో మెజారిటీ లోక్ సభ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే టఫ్ ఫైట్ నడిచినట్టు పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా గత తెలంగాణ అసెంబ్లీలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలు నెరవేర్చలేకపోయిందనేది పబ్లిక్ చెబుతున్న మాట. మరోవైపు లోక్‌సభ ఎన్నిలనేవి ప్రధాన మంత్రిని నిర్ణయించే ఎన్నికలు. ముఖ్యంగా తెలంగాణలో నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ బాగానే వర్కౌట్ అయినట్టు గ్రౌండ్ రియాలిటీలో కనిపిస్తోంది. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో గెలిచిన సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలతో పాటు మహబూబ్ నగర్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, చెవెళ్ల స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని పలు పోస్ట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందని చెబుతున్నారు. అటు భువనగిరి స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరిగా ఉంది. మెదక్ స్థానంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, నాగర్ కర్నూల్ మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలే పుష్కలంగా ఉన్నట్టు పలు పోస్ట్ సర్వేలు ఘోషిస్తున్నాయి. మరి ఈ సర్వేలు చెబుతున్నట్టు బీజేపీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 కౌంటింగ్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇదీ చదవండి: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter