PM Modi: ఈనెల 12న తెలంగాణకు ప్రధాని మోదీ... సీఎం హాజరవుతారా?

PM Modi Telangana tour: ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాన మంత్రి మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 06:24 AM IST
PM Modi: ఈనెల 12న తెలంగాణకు ప్రధాని మోదీ... సీఎం హాజరవుతారా?

PM Modi Telangana tour: మరో వారం రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ టూర్ లో భాగంగా రామగుండం వెళ్లనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాకుండా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ప్రసగించనున్నారు. ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రామగుండం వెళతారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే.

12న ప్రధాని పర్యటన నేపథ్యంలో.. రాష్ట్ర ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ప్రధాని మోదీ టూర్ ఏర్పాట్లను అత్యంత పకడ్భందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పనిచేయాలని.. సెక్యూరిటీ, శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళతారా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. 

విశాఖకు మోదీ

అదే విధంగా తెలంగాణ పర్యటనకు ఒక్కరోజు ముందు ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. నవంబర్ 11న విశాఖపట్నంలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలు కార్యక్రమాలనూ ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరుకానున్నారు. మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్దమయ్యాయి.

Also Read: CM KCR Videos: జబర్దస్త్ కామెడీ షో.. సీఎం కేసీఆర్ వీడియోలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News