Coronapreparations: అలాంటి ప్రసారాలు చేసిన వారిపై కఠిన చర్యలు..

కరోనా వైరస్ మహమ్మారి గాలిలో ద్వారా వ్యాపించేది కాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వ్యక్తులతో వస్తోందన్నారు. కాగా నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని క్రీడా సముదాయాన్ని మంత్రి ఈటల రాజేందర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…

Last Updated : Mar 28, 2020, 06:07 PM IST
Coronapreparations: అలాంటి ప్రసారాలు చేసిన వారిపై కఠిన చర్యలు..

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి గాలిలో ద్వారా వ్యాపించేది కాదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన వ్యక్తులతో వస్తోందన్నారు. కాగా నేడు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని క్రీడా సముదాయాన్ని మంత్రి ఈటల రాజేందర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… విదేశాల నుంచి వచ్చినవారు కుటుంబసభ్యులను కలవడం ద్వారా సోకిందని, కరోనా వైరస్ సోకిన వ్యక్తి నుంచే కరోనా సంక్రమిస్తోందని అన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేయవద్దని, సామాజిక మాధ్యమాలను, ప్రసార మాధ్యమాలను కోరుతున్నామని అన్నారు. అసత్యవార్తలను ప్రసారం చేసిన వారిపై తీవ్రమైన చర్యలుంటాయని అన్నారు. 

Also Read: అన్నపూర్ణ క్యాంటీన్లలో ఉచిత భోజనం
గచ్చిబౌలిలో 1500 మందిని క్వారంటైన్ చేసే విధంగా యుద్ధప్రాతిపదికన ఆరు రోజుల్లో క్వారంటైన్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని, నగరంలో ఇప్పటి వరకు రెడ్ జోన్లు ప్రకటించలేదని, కరోనా వ్యాప్తిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారని అన్నారు. కరోనా మహమ్మారిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌ను కరోనా పేషెంట్ల కోసం కేటాయించామని, తెలంగాణలో కరోనా కట్టడికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ఎయిర్‌పోర్టులో పనిచేసే వారిలో చాలా మందికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్సనందిస్తున్నామని, ప్రతిఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News