Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత 4-5 రోజుల్నించి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో సైతం రోజూ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావం కారణంగా రానున్న ఐదు రోజులు తెలంగాణలోని ఈ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది.
నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుుడు మరోసారి అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్రంలో మరో 5 రోజులు అంటే జూలై 18 వరకూ వర్షాలు విస్తృతంగా పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా 13 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు వీయవచ్చని, పిడుగులు పడే ప్రమాదముందని తెలిపింది.
ఇవాళ, రేపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో ఈ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. పిడుగులు పడే ప్రమాదమున్నందున బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, పొలాల్లో వెళ్లకూడదని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. నిన్నట్నించి హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండనుంది.
Also read: Software CEO Kidnapped: మూడు నెలలుగా జీతాలు లేని ఉద్యోగులు.. సీఈఓకు ఊహించని షాకిచ్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook