Heavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షసూచన

Heavy Rains Alert: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 10, 2024, 03:14 PM IST
Heavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షసూచన

Heavy Rains Alert: ప్రస్తుతం తెలంగాణలో దిుగవ స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల్నించి వీస్తున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుత సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీతీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడవచ్చు. 

Add Zee News as a Preferred Source

తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ , హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దాంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులుంటాయని ఐఎండీ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. 

హైదరాబాద్‌లో భారీ వర్షం

ఇవాళ హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశముంది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షం కారణంగా నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. 

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అదే సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. 

Also read: CM Revanth Reddy: గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ కి 100 కోట్ల లాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News