నవంబర్1 నుంచి ఈఎస్ఐ సేవలు నిలిపివేత

Last Updated : Oct 31, 2017, 08:44 AM IST
నవంబర్1 నుంచి ఈఎస్ఐ సేవలు నిలిపివేత

నవంబర్‌ ఒకటో తేదీ నుంచి తెలంగాణలోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఈఎస్ఐ సేవలు నిలిచిపోనున్నాయి.  నగదురహిత  వైద్య బిల్లుల చెల్లింపుల్లో (క్యాష్ లెస్ సర్వీసెస్) తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ హాస్పిటల్స్ అసోసియేషన్స్ (టిఎస్హెచ్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎస్‌ఐతో రాష్ట్రవ్యాప్తంగా 50 స్పెషాలిటీ ఆస్పత్రులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో వరంగల్, కరీంనగర్‌లోని నాలుగు మినహా మిగిలిన ఆసుపత్రులన్నీ రాజధాని హైదరాబాద్లోనే ఉన్నాయి.

ఈ ఆసుపత్రుల్లో రోజుకు 200 మంది ఈఎస్ఐ లబ్ధిదారులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. లబ్ధిదారులకు మెరుగైన చికిత్స చేసి ఇంటికి పంపించినా..  సకాలంలో వైద్య బిల్లులు చెల్లించడం లేదని, కొన్నిఆస్పత్రులకు 2012 నుంచి ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపింది. భారీ మొత్తంలో పేరుకుపోయిన బిల్లులను సత్వరం చెల్లించాలని సూచించింది. పెరిగిన ధరలకు ఈఎస్ఐ ప్యాకేజీలు లేవని వాపోయింది. అందుకే ఇకపై ఈఎస్‌ఐ లబ్ధిదారులకు తమ అస్పత్రుల్లో క్యాష్ లెస్ సేవలు/క్రెడిట్ ట్రీట్మెంట్ అందించడం కుదరదని తేల్చి చెప్పింది.

Trending News