Telangana: రేపు అన్ని స్కూల్స్..కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు హలీడే.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం..

Hyderabad: ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ నేపథ్యంలో రేపు (గురువారం) హలీడేను డిక్లెర్ చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీచేసింది. ఈ రోజు ముస్లిం సోదరులంతా మసీదులకు వెళ్లి ప్రత్యేకంగా నమాజ్ లుచేస్తారు. అంతే కాకుండా మసీదులలో దీపాలను వెలిగిస్తారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 7, 2024, 07:08 PM IST
  • - రేపు అన్ని ప్రభుత్వ శాఖలకు హలీడ్..
    - ముస్లింల ఫెస్టివల్ నేపథ్యంలో ఉత్తర్వులు..
Telangana: రేపు అన్ని స్కూల్స్..కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు  హలీడే.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం..

Holiday For Shab E Meraj Festival:  తెలంగాణ సర్కారు ఫిబ్రవరి 8 వ (గురువారం) తేదీని రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించింది. ముస్లిం షబ్-ఎ-మెరాజ్ పండుగ నేపథ్యంలో ఫిబ్రవరి 8 ని ఇప్పటికే సెలవుగా డిక్లెర్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఇది ఆప్షనల్ హలీడేగా ఉన్న దాన్ని ప్రస్తుతం సాధారణ సెలవుదినంగా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. షబ్-ఎ-మెరాజ్ ఫెస్టివల్ ను ముస్లింలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

Read More: Nawabi Semai : నవాబులనాటి నోరూరించే సేమియా.. గిన్నె ఖాళీ చేయాల్సిందే

ఈ రోజున ముస్లింలు.. మసీదులను అందమైన దీపాలతో అలంకరిస్తారు.  ఆతర్వాత రాత్రిపూట జాగరణ కూడా చేస్తారు.  ఈక్రమంలోనే రేపు (గురువారం) రోజున స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవుగా ప్రకటించింది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.

దీంతో గురువారం ఏదైన కార్యాలయాలో పనులున్న వారు శుక్రవారం వెళ్లేలా ప్లాన్ లు చేసుకొవాలి. అదే విధంగా ఎవరైన అధికారులు ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం, శుక్రవారం, శనివారం , ఆదివారం నాలుగు రోజులు కూడా ప్లాన్ లు చేసుకుని ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తో టూర్ లకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News