Nalgonda News: 5 వ సారి ప్రెగ్నెంట్ .. సిగ్గులేదా అంటూ డాక్టర్ ఘాటు వ్యాఖ్యలు..ఎక్కడో తెలుసా..?

Pregnant Women: మహిళ ఇప్పటికే పలుమార్లు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె తాజాగా, ఆరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమెకు డాక్టర్ ఊహించని విధంగా చివాట్లు పెట్టింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 5, 2024, 06:07 PM IST
  • ఆస్పత్రి ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళ..
  • లేడీ డాక్టర్ పై ఫిర్యాదుచేసిన రోగి బంధువులు..
Nalgonda News: 5 వ సారి ప్రెగ్నెంట్ .. సిగ్గులేదా అంటూ డాక్టర్ ఘాటు వ్యాఖ్యలు..ఎక్కడో తెలుసా..?

Doctors Fires On Pegnant Woman In Nalgonda: సాధారణంగా డాక్టర్లను దేవుడిగా భావిస్తారు. కొందరు వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు,కొన్నివిషయాలలో అవగాహనకూడా కల్పిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. కొందరు పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టు, గుడుల చుట్టు తిరుగుతుంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని, ఒకరు లేదా ఇద్దరు పిల్లలుంటేనే మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఖర్చులకు, ఇప్పటి ఖర్చులకు ఎంతో వ్యత్యాసం ఉంది. పిల్లలు పుట్టడం పెరగటం ఒక ఎత్తైతే వారికి మంచి చదువు చెప్పిండం, మంచి పౌరులుగా తీర్చి దిద్దడం మరో ఎత్తు. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతునే ఉంటాయి. అయిన కూడా కొన్నిచోట్ల పిల్లలను కనడం విషయంలో తల్లులు అవగాహన రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.

Read More: Mumbai Woman With 4 Lakhs: రూ. కోటి ప్యాకేజీ ఉన్న అబ్బాయే కావాలి.. అద్దంలో ముఖం చూసుకొమ్మంటూ నెటిజన్లు ఫైర్..

పాత కాలంలో ఇంట్లో అప్పట్లో మహిళలకు.. ఎనిమిది మంది, పదేసి సంతానం ఉండేవారు. అప్పట్లో జాయింగ్ ఫ్యామిలీ ఉండటం వల్ల పోషణకు కూడా ఇబ్బందులు ఉండేవికావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంతో ఉన్నత ఉద్యోగులైన, పెద్దజాబులున్న కూడా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చాలనుకుంటున్నారు. ఇలాంటిక్రమంలో ఒక మహిళ ఇప్పటికే ఆరుగురు పిల్లల్ని జన్మనిచ్చింది.అంతే కాకుండా మరోసారి ప్రెగ్నెంట్ అయి, చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. దీంతో మహిళా డాక్టర్ కాస్తంతా కటువుగా ఆమెకు చివాట్లు పెట్టింది. ఈ  ఘటన నల్గొండలో పరిధిలో చోటు చేసుకుంది.

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో ఒక ముస్లిం మహిళ చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను టెస్ట్ చేసిన మహిళా డాక్టర్ ఎన్నో కాన్పు అని అడిగింది. దీనికి ఆమె..ఐదవ కాన్పు అని చెప్పింది. దీంతో డాక్టర్ ఆగ్రహంతో సదరు మహిళను పట్టుకుని, చివాట్లు పెట్టింది. మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలో మహిళ ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు చెప్పింది. వారంతా ఆస్పత్రికి చేరుకుని డాక్టర్తో వాగ్వాదానికి దిగారు. సదరు మహిళ ఆరోగ్యం గురించి మాత్రమే తాను.. అలా చెప్పినట్లు తెలిపింది.

కానీ ఇదంతా పట్టింకోని సదరు కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళ డాక్టర్ అసభ్య పదజాలంతో దూశించందంటూ కూడా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా.. పిల్లలను కన్నతర్వాత మహిళలు శారీరంగా,మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Read More: Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

అదే విధంగా.. పుట్టిన బిడ్డలకు సరైన పోషకాహారం, చదువు లభించకుంటే తీవ్ర ఇబ్బందులపాలౌతారని కూడా నిపుణులు చెబుతున్నారు. కొందరు మహిళ డాక్టర్ చేసిన పనికి సపోర్టు చేస్తున్నారు. అదే విధంగా ఒక వర్గానికి చెందిన వారు మాత్రం ఇది తమ మతంలో ఉందని, వైద్యులు వైద్యం మాత్రమే చేయాలని ఇలాంటి వాటిల్లో కల్గచేసుకొవడం ఎందుకంటూ వితండవాదం చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x