సీటుపై ఆశలు గల్లంతు ; బండ్ల గణేష్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

                              

Last Updated : Nov 14, 2018, 02:23 PM IST
సీటుపై ఆశలు గల్లంతు ; బండ్ల గణేష్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

కమీడియన్ గా పరిచయమైన బండ్లాగణేష్ ..అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాతగా అవరించారు. ఈ క్రమంలో కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీలో చేశారు. అయితే ఊహించని విధంగా ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. తనకు టికెట్ వస్తుందని ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్న బండ్ల గణేష్ ..ఒకానొక సందర్భంలో ఓ టీవీ ఛానల్ సాక్షిగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే తాజా పరిణామం ఆయనకు మింగుపడటం లేదు. వాస్తవానికి బండ్లగణేష్ షాద్ నగర్ సీటుపై గంపెడు  ఆశలు పెట్టుకున్నారు. అది కాకుంటే కనీసం జంట నగరాల్లో ఏదో ఒక సీటు వస్తుందని ఎదురు చూశారు. తొలి జాబితాలో పేరు లేదు..రెండో జాబితాలోనూ ఆయన ఊసే లేదు. దీంతో దాదాపు ఆయనకు దారులన్నీ మూసుకుపోయినట్లేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు.

ఈ సందర్బంగా బండ్లగణేష్ మాట్లాడుతూ తాను టికెట్ వస్తుందని ఆశపడ్డానని..అయితే అనుగ్రహం కలగలేదని వేదాంత ధోరణిలో మాట్లాడారు. ఇంతకు ముందు టీవీ ఛానల్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కదా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తనకు టికెట్ గ్యారెంటీ అని ఎక్కడా చెప్పలేదని.. అయితే వస్తుందనే గట్టి నమ్మకం మాత్రం ఉండేదని ఆయన వివరణ ఇచ్చారు. టికెట్ వచ్చినా రాకున్నా తాను మాత్రం కాంగ్రెస్ వాదినేనని.. భవిష్యత్తులో కాంగ్రెస్ వాదిగానే ఉంటానని హస్తం పార్టీ పట్ల బండ్లగణేష్ తన అభిమానాన్ని చాటుకున్నారు. 

Trending News