Cm Revanth Reddy Brother: ఏదైనా పదవి రాబోతుందా? ఎందుకీ హంగామా..!

Cm Revanth Reddy Brother Thirupathi Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి జన్మదిన వేడుకలు  హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పత్రికల్లోని ఫ్రంట్‌ పేజీల్లో యాడ్స్‌తో పాటు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై  రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంత హంగామా చేయడానికి కారణాలేంటి?

Written by - Indupriyal Radha Krishna | Last Updated : Aug 17, 2024, 04:21 PM IST
Cm Revanth Reddy Brother: ఏదైనా పదవి రాబోతుందా? ఎందుకీ హంగామా..!

Cm Revanth Reddy Brother Thirupathi Reddy: రాష్ట్రాన్ని నడిపిస్తున్న కీలక నేత సోదరుడు అతడు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ సారి ఆయన గారి జన్మదిన వేడుకలు జరిగాయి. పేపర్లలో పెద్ద పెద్ద యాడ్ లు, సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై అందరిలో పెద్ద చర్చే జరుగుతుంది. ఇంతకీ ఎప్పుడూ లేనట్లుగా బర్త్ డే వేడుకలు ఆర్భాటంగా నిర్వహించడం  వెనుక ఏదైనా మతలబు ఉందా...కీలక నేత సోదరుడికి ఏదైనా పదవి దక్కబోతుందా...లేదా ఎన్నాళ్లుగో ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన ఎంట్రీ త్వరలో ఉండబోతుందా..అసలు పొలిటికల్ సర్కిల్స్  జరుగుతున్న చర్చ ఏంటి..

ప్రభుత్వాధినేత సోదరుడి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా  ఆయన సోదరుడి బర్త్ డే వేడుకలు అంగరంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగేలా చేసింది. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు ఆయన సోదరుడు ఎవరని అనుకుంటున్నారా ఇంకెవరండీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి పుట్టిన రోజు వేడుకలు చాలా కోలాహలంగా జరిగాయి. సీఎం సొంత జిల్లాతో పాటు హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి అభిమానులు, అనచరులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన దిన పత్రికల్లో మొదటి పేజీలో యాడ్ కూడా ఇచ్చారు. అంతే కాదు హైదరాబాద్ ప్రధాన సెంటర్లలో పెద్ద పెద్ద హోర్డింగులు కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంతక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో  పెద్దగా క్రియాశీలంగా ఉన్న దాఖలాలు లేవు.  అలాంటి వ్యక్తి బర్త్ డే వేడుకలు ఇంత ఆర్భాటంగా ఎందుకు చేసినట్లు అని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా తెర వెనుక తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించేవాడని ఆయన సన్నిహితులు చెబుతుతన్నారు. రేవంత్ రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్న సమయంలో ఆయన సోదరులే వ్యాపారులు, కుటుంబ వ్యవహారాలు చూసుకునేవారు తప్పా గతంలోఎ ఏనాడు రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉన్న పరిస్థితులు లేవు. అలాంటి తరుణంలో ఇప్పుడు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి పుట్టిన రోజు అంతలా ఎందుకు నిర్వహించారా అని టీ కాంగ్రెస్ లో చెవులు కొరుక్కుంటున్నారు. తిరుపతి రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్నారా లేక రేవంత్ రెడ్డే సోదరుడిని యాక్టివ్ పాలిటిక్స్ లో దించాలని అనుకుంటున్నాడా అని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గతంలో ఎమ్మెల్సీ,  ఎంపీ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి సోదరుడు బరిలో ఉంటారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవంగా జరగలేదు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి ప్రచారమే జరగడానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు.

అయితే తను రాజకీయంగా ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో ఉండడానికి కారణం తన సోదరులే అని..వారి మద్దతుతోనే నేను ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అయ్యానని చాలా సందర్భాల్లో  తన సోదరులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పేవారు.  సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తన సోదరులు ప్రభుత్వ వ్యవహారాలు, ఇతరత్రా వ్యవహారాల్లో తలదూర్చని..వారు ఎట్టిపరిస్థితుల్లో తమ పరిధి దాటరని తనకు నమ్మకం ఉందని చెప్పేవారు. అంతే కాదు ఒక అడుగు ముందుకేసి కుటుంబ పాలన అనే విమర్శలు తనపై రాకుండా జాగ్రత్తపడుతానని రేవంత్ మీడియాతో చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పటి వరకు వారు  ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో తలదూర్చిన సందర్భాలు కనపడలేదు. అడపాదడపా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో  చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తప్పా  పెద్దగా ఇతరత్రా  విమర్శలు  వచ్చిన సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు.  అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నట్లుండి ఇలా ఒక్కసారిగా బర్త్ డే మాటున రాష్ట్ర వ్యాప్తంగా  హైలెట్ అవడం వెనుక కారణం ఏమయ్యింటుందా అని  నేతలు ఆరా తీస్తున్నారు. 

ఇక రేవంత్ రెడ్డి మద్దతుదారులు మాత్రం ఇదంతా యాదృశ్చికంగా జరిగిందే తప్పా దీనిలో పెద్దగా రాజకీయాలు ఏమీ లేవని చెప్పుకొస్తున్నారు. ఒక వేళ తిరుపతి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తప్పేంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల్లో సోదరులు, తండ్రీ కొడుకులు, భార్య,భర్తలు లేరా..అలాంటప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడు ఆక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవడం వెనుక తిరుపతిరెడ్డి కీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ కోసం తిరుపతి రెడ్డి పని చేసినప్పుడు పదవులు కూడా ఆశించడంపై ఎవరికీ ఇబ్బంది ఉండదని వారు చెబుతున్నారు. ఎవరికి పదువులు వస్తే పార్టీకీ ప్రయోజనం చేకూరుతుందో వారికే అధిష్టానం పదవులు కట్టబెడుతుందని రేవంత్ అభిమానులు చెబుతున్నారు.

మరోపక్క రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బర్త్ డే యాడ్స్, హోర్డింగులు పెట్డడం వెనుక కేవలం ఆయన అభిమానులే ఉన్నారా లేక అంతకు మించి ఇంకా ఏదైనా రాజకీయ కారణం ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లుగా తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారు అని ప్రకటించారు. కానీ  ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తిరుపతి రెడ్డి మాత్రం పొలిటికల్ ఎంట్రీకీ సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా ఈ బర్త్ డే హంగామా తిరుపతి రెడ్డి పొలిటికల్ ఎంట్రీకీ కారణమవుతుందా లేకా సీఎం సోదరుడిగానే ఎప్పటిలాగా తన పని తాను చేసుకుంటూ పోతారా అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News