MP Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు.
అంబేడ్కర్ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం రైతు సమస్యలను విస్మరించింది..
గత మూడు నెలల నుంచి తెలంగాణలో పంట కొనుగోలు చేయక రైతులు అల్లాడిపోతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కారణంగా చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు (Revanth reddy on farmers issues) చెప్పారు. రైతులు చనిపోతున్నా కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనలు తెలపడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు.
టీఆర్ఎస్ ఎంపీలు మధ్యపెడుతున్నారు..
పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనల పేరుతో ప్రజలను మధ్య పెడుతున్నారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగి.. టీఆర్ఎస్ ఎంపీలు తాము పార్లమెంట్లో నిరసనలు తెలుపుతున్నాని చెప్పుకుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. నిజంగా నిరసన తెలిపే ఉద్దేశముంటే.. ఈ సమయంలో కేసీఆర్, సంబంధిత మంత్రులు ఎందుకు ఢిల్లీకి రావడం లేదని ప్రశ్నించారు.
గతంలో రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతా, మోదీ మెడలు వంచుతాం అన్న సీఎం కేసీఆర్ (Revanth Reddy fire on CM KCR) ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించారు..
కోటి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రకటించిందన్నారు. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర తగ్గించారని (Telangana Paddy Procurement Target) ఆరోపించారు. ఇది రైస్ మిళ్లర్లకు అనుకూలంగా తీసుకున్న చర్యగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. మిళ్లర్ల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం బంధీ అయ్యిందన్నారు.
కేంద్రంలో ఎంపీలు హడావుడి చేశారని.. అయితే పీయూష్ గోయల్ సమాధానంతో ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేకపోయిందని తెలిసినట్లు పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ ఆఫీస్ నుంచి ఆదేశాలు..
టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు రేపు సాయంత్రానికి హైదారాబాద్‌కు చేరుకుంటారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సమస్యలపై పోరాడకుండా ఎంపీలను వెనక్కి రమ్మని కేసీఆర్ చెప్పినట్లు ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆఫీస్ (PM Modi) నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇక పార్లమెంట్‌కు హాజరుకారని ఆరోపించారు.
Also read: Etela Rajender: ఈటల రాజేందర్ భూకబ్జా వాస్తవమే.. ప్రభుత్వానికి మెదక్ కలెక్టర్ నివేదిక
Also read: Hyderabad: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం-ఇద్దరు అక్కడికక్కడే మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook