Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ డ్రామాలు.. రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 5, 2023, 04:14 PM IST
Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ డ్రామాలు.. రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy On CM KCR: కర్ణాటకలో బీజేపీని గెలిపించేందుకే సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 8న సరూర్ నగర్‌లో సాయంత్రం 3 గంటలకు యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ ప్రకటించారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. 'నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మార్చేశారు. వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు.

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మోడల్‌కు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగం వదిలేసి శరద్ మడ్కర్ అనే వ్యక్తి బీఆర్‌ఎస్‌లో చేరారని పత్రికల్లో ప్రచారం చేసుకున్నారు. ఏప్రిల్ 10న బీఆర్‌ఎస్‌లో చేరిన అతనికి మే 2న సీఎం ప్రైవేటు సెక్రటరీగా నియమించారు. ఇందుకు సంబంధించిన జీవోను  రహస్యంగా ఉంచారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్ పక్క రాష్ట్రంలో వాళ్లను తెచ్చి పెట్టుకుంటున్నారు. పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు కిరాయి మనుషులను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎవరి సొమ్మని ఏడాదికి రూ.18 లక్షలు అతనికి జీతం ఇస్తున్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి..' రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణలోని 20 లక్షల విద్యార్థులకు, 30 లక్షల నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా.. 8న జరిగే యువ సంఘర్షణ సభకు తరలిరావాలని రేవంత్ రెడ్డి కోరారు. రైతు డిక్లరేషన్‌లా సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని తెలిపారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్దతుగా తరలిరావాలని అన్నారు. బీజేపీని గెలిపించేందుకే కర్ణాటకలో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని.. నిజంగా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకుంటే కర్ణాటకలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీని ఓడించాలని ప్రకటించాలని సవాల్ చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని అన్నారు. కేసీఆర్ సచివాలయాన్ని ప్రయివేట్ ఎస్టేట్ అనుకుంటున్నారని.. త్వరలోనే ఆయన భ్రమలు తొలగిపోతాయన్నారు.

Also Read: RR Vs GT Dream 11 Prediction: టాప్ ప్లేస్‌కు టఫ్‌ వార్.. రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ అమీతుమీ.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!  

Also Read: YS Sharmila: మాకు నమ్మకం లేదు దొరా.. సిట్‌తోనే మమ అనిపిస్తున్నారు: వైఎస్ షర్మిల  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News