TRS ex MP Kavitha: హోమ్ క్వారంటైన్‌లో మాజీ ఎంపీ కవిత

టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్‌కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్  అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

Last Updated : Jul 24, 2020, 12:00 AM IST
TRS ex MP Kavitha: హోమ్ క్వారంటైన్‌లో మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్ : టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్‌కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్  అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కవితతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే హోం క్వారంటైన్‌ ( Home quarantine ) అవుతున్నారు.

ఇదిలావుంటే, తన సోదరుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు కవిత ఓ పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. '' వెనకడుగేయని కాలం పేరే కేటీఆర్ '' అంటూ సాగిన ఈ పాటను ( KTR Birthday Special Song ) హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిర్మించారు. ఈ పాటను విడుదల చేసే కార్యక్రమానికి కవిత హాజరైన తర్వాత కొద్దిసేపటికే.. ఆమె కారు డ్రైవర్‌కు కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని సమాచారం.

Trending News