తెలంగాణ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ .. కేంద్ర వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్ల దగ్గరి నుంచి నిధుల వరకు అన్ని విషయాల్లో కేంద్రం తమ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని దయ్యబట్టారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. సాగునీటి రంగంలో అభివృద్ధి సాధించాలన్న.. భారీ వ్యయంతో కూడిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న.. ఏ రాష్ట్రానికైనా కేంద్ర సాయం అవసరం..వాస్తవానికి ఈ విషయంలో కేంద్రం తెలంగాణకు ఎలాంటి సాయం అందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు..
ఈ సందర్బంగా మిషన్ భగీరథ మిషన్, మిషన్ కాకతీయ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయంలో తమకు సహకరిస్తారాలేదా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ రెండు మిషన్లు దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ చేత ప్రసంశలు అందుకున్నాం..ఎన్నో అవార్డులు సాధించాం..కేంద్రం కూడా అనేక సార్లు ఈ మిషన్లపై ప్రశంజల జల్లు కురిపింది. మిషన్ బగీరథ 19వేల 205 కోట్లు , మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు..మొత్తం కలిసి 24 వేల కోట్లు సహాయం అందించాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రసంశలు తప్పితే పైసా కూడా ఇవ్వడం లేదని కేటీఆర్ విమర్శించారు. పక్క రాష్ట్రంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరంటూ ఈ సందర్భంగా మోడీ సర్కార్ ను కేటీఆర్ నిలదీశారు
తెలంగాణపై సవితి తల్లి ప్రేమ
బీజేపీకి తెలంగాణలో ఉనికి లేదని పేర్కొన్న కేటీఆర్..రాజకీయ దురుద్దేశంతో మోడీ సర్కార్ తమ రాష్ట్రంపై పక్ష పాత వైఖరిని ప్రదర్శిస్తోంది..దీన్ని తెలంగాణ ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర సీఎం కేంద్రానికి సాయం కోరితే వెంటనే స్పందించి సాగునీటి ప్రాజెక్టులో 25 శాతం భరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడ సీఎం కేసీఆర్ అనేక సార్లు కేంద్రానికి కోరినా..సాయం చేసేందుకు ముందుకు రాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవు ...జాగ్రత్త
బీజేపీ వారు అధికారంలోకి ఉన్న రాష్ట్రలకు ఒక న్యాయం..అధికారం లేని రాష్రానికి మరో రకంగా చూస్తన్నాని..ప్రధానంగా తెలంగాణ విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తుస్నారంటూ ప్రధాని మోడీ పై విమర్శలు సంధించారు.. ఒక్క సాగునీటి ప్రాజెక్టు విషయంలోనే కాదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పన్నులు వాట, జీఎస్టీ వాటా, ఇలా రంగానికి చూసుకున్నా కేంద్రం ప్రభుత్వం తెలంగాణ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ దయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే..వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న ఒక సీట కూడా కోల్పోయి..డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఈ సందర్భంగా మోడీ సర్కార్ కు హెచ్చరించారు.